Ram Charan- Allu Arjun : రామ్ చరణ్ – అల్లు అర్జున్ కాంబోలో మూవీ.. ఇదేం ట్విస్ట్ మామా..!

Ram Charan- Allu Arjun : గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు మెగా కాంపౌండ్ నుంచే వచ్చిన హీరోలు అన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీరిద్దరు గతంలో ఎవడు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు కానీ మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీలో గొడవలు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైం లో వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

చెర్రీ, బన్నీ ఎవడు అనే సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే చరణ్, బన్నీ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్త నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రకటన రానుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సినిమా రావడం కష్టమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రాబోతుందని సమాచారం..

Ram Charan - Allu Arjun combo movie..
Ram Charan – Allu Arjun combo movie..

ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా, పుష్ప 2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా 700 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.. ఈ రెండు సినిమాల నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. భారీ అంచనాలతో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ నుంచి అందుకుంటుందో చూడాలి..

- Advertisement -

ఇకపోతే వీరిద్దరూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబుతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుక్కు తో రంగస్థలం 2 సినిమాను చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు