Tollywood Heroine.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా అభిమానుల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో బలగం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను జబర్దస్త్ కమెడియన్ వేణు యల్దండి డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు మంచి పేరు కూడా వచ్చింది. అంతేకాదు ఇటీవల అవార్డులలో కూడా బలగం సినిమా సత్తా చాటింది. ఇదిలా ఉండగా బలగం సినిమాలో లక్ష్మీ పాత్రలో నటించిన నటి రూపలక్ష్మి ఈ చిత్రంతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. అంతేకాదు బలగం సినిమా తెచ్చిన క్రేజ్.. ఆ తర్వాత ఈమెకు ఎన్నో చిత్రాలలో అవకాశం కల్పించిందని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ వల్లే దేవర మూవీలో అవకాశం.
తాజాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రూప లక్ష్మి.. దేవర సినిమాలో తనకు ఎన్టీఆర్ వల్లే నటించే అవకాశం వచ్చిందని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందులో తన అనుభవాలను సైతం పంచుకుంటూ.. తనకు సీనియర్ ఆర్టిస్టులు అంటే చాలా గౌరవము.. అందుకే వారి నుంచి తాను క్రమశిక్షణ నేర్చుకున్నాను అంటూ తెలుపుకొచ్చింది. అలాగే తాను ఒప్పుకునే ప్రతి పాత్రకు కూడా న్యాయం చేయగలనని నమ్మకం ఉంటేనే ఖచ్చితంగా ఆ పాత్రను చేస్తానంటూ.. ఆ పాత్ర కోసం చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటానని తెలిపింది రూపా లక్ష్మి.
ఎన్టీఆర్ పొగుడుతుంటే తట్టుకోలేకపోయా..
అయితే దేవర చిత్రంలో తనది కీలకమైన పాత్ర అని, ఈ పాత్రను కూడా షూటింగ్ చేశారు అని తెలిపింది. ఆ పాత్రకి తనని తీసుకోమని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ సలహా ఇచ్చారట. ఈ విషయం విన్న తర్వాత తనకి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగిందంటూ రూపా లక్ష్మి తెలియజేసింది. అలా సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్టీఆర్ ని కలవగా.. అప్పుడే ఆయన బలగం సినిమా గురించి ప్రస్తావించడం సంతోషాన్ని కలిగించింది అంతేకాదు ఆ చిత్రంలో నా నటన చూసి ఆయన నన్ను ప్రశంసించడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటూ తెలిపింది రూపా లక్ష్మి. అంతేకాదు ఆయన నా తో మాట్లాడుతున్నంతసేపు నన్ను పొగుడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో ఆనందం నన్ను మరింత ఆనందపరిచింది అంటూ చెప్పుకొచ్చింది రూపా లక్ష్మి.
బలగం సినిమా వల్లే ఈ గుర్తింపు..
తాను ఈ స్థాయిలో రావడానికి ముఖ్య కారణం బలగం సినిమా అని అంటూ తెలిపింది. బలగం సినిమా తనకు వచ్చిన ఒక అదృష్టంగా భావిస్తాను అంటూ తెలిపింది రూపా లక్ష్మి. ప్రస్తుత రూప లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులను రూపా లక్ష్మి మెప్పించింది అంటే ఈమె నటన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రస్తుతం రూపాయల లక్ష్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి బలగం సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈ దేవరా సినిమాతో మరెలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.