Unstoppable Season 4 : మళ్లీ ఆహాలో సందడి చెయ్యబోతున్న బాలయ్య.. ఎప్పటినుంచంటే?

Unstoppable Season 4 : టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి హీరో బాలయ్య సినిమాలు మాత్రమే కాదు. షోలు కూడా చేసాడన్న సంగతి తెలిసిందే. ఈయన హోస్ట్ చేసిన ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ టాక్ షో చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో వచ్చిన తొలి మూడు సీజన్లు అద్భుతమైన సక్సెస్ అయ్యాయి.. ప్రస్తుతం నాలుగో సీజన్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. టాప్ స్టార్లు పాల్గొన్న ఈ షో భారీ వ్యూస్ దక్కించుకుంది. మూడో సీజన్ లిమిటెడ్ ఎడిషన్‍గానే వచ్చింది. ఇప్పుడు నాలుగో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఎప్పుడు ఈ షో మొదలవుతుందో ఒకసారి చూసేద్దాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ఈ షో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో నాలుగో సీజన్ కు కూడా బాలయ్యే హోస్ట్ గా చెయ్యనున్నారు. దసరా సందర్భంగా ప్రారంభించాలని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‍ను అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే షూటింగ్ గురించి మరో అప్డేట్ రానున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో NBK 109 అనే మాస్ యాక్షన్ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే నెల రెండో వారం లోగా సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమాలు లేవని తెలుస్తుంది. సెప్టెంబర్ మూడో వారంలో ఈ షో షూటింగ్ ను మేకర్స్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే నాలుగో సీజన్ గురించి త్వరలోనే ఆహా అధికారిక ప్రకటన చేయనుంది. త్వరలోనే అంటూ అప్‍డేట్‍ను సిద్దం చేస్తోందని టాక్.. అనుకున్నట్లు జరిగితే ఈ షో దసరాకు స్ట్రీమింగ్ కాబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

గత సీజన్లకు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, రష్మిక మందన్న, రణబీర్ కపూర్, ప్రభాస్, పొలిటికల్ లీడర్స్, రాజమౌళి, గోపి చంద్ తో పాటుగా మరికొంతమంది సెలెబ్రేటీలు ఈ షోలో పాల్గొన్నారు. బాలకృష్ణ హోస్టింగ్ వల్లే షో మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్‍బీకే109 చేస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ లో సినిమా రానుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు