Ujwal Kulkarni : అప్పుడు సౌత్ ఇండస్ట్రీ షేక్ చేసాడు , ఇప్పుడు దర్శకుడితోనే స్క్రీన్ ప్లే మార్చేలా ఎడిట్ చేసాడు

Ujwal Kulkarni : ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలోని కొన్ని షాట్స్ ని కట్ చేసి ఉజ్వల్ కులకర్ణి అనే ఒక అబ్బాయి ఒక వీడియోను చేశాడు. కేవలం 1700 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియోను అప్లోడ్ చేశాడు. ఆ వీడియోని దాదాపు 8,000 మంది చూశారు. దాన్లో చాలామంది ఎడిటింగ్ బాగుంది అంటూ కామెంట్ చేశారు. ఒక నెటిజన్ ఈ వీడియో నేను ప్రశాంత్ నీల్ చూపిస్తాను అంటూ కామెంట్ చేసింది.

అయితే ఆ వీడియోని చూసిన ప్రశాంత్ కేజిఎఫ్ 2 కి ఎడిటర్ గా అవకాశం ఇచ్చాడు. 16 సంవత్సరాల ఏజ్ ఉన్న ఒక అబ్బాయి సరిగ్గా 19 సంవత్సరాల కి ఒక పాన్ ఇండియా సినిమాకి ఎడిటర్ గా మారిపోయాడు. ఇప్పటివరకు ఎడిటర్ కులకర్ణి రెండు సినిమాలకు ఎడిటర్ గా పని చేశాడు. ఉజ్వల్ కులకర్ణి కేజీఎఫ్ 2 సినిమాకి ఎడిటర్ గా పని చేశాడు. ఆ తర్వాత సలార్ సినిమాకి ఎడిటర్ గా పనిచేశాడు. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా పని చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం వలన మిస్టర్ బచ్చన్ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేశాడు.

Ujjwal Kulkarni

- Advertisement -

కేజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాను చూసినప్పుడు హరీష్ శంకర్ ఈ ఎడిటర్ ఎవరో పిలిపించండి అంటూ టీం కి చెప్పాడు. మళ్లీ కొన్ని రోజుల తర్వాత హరీష్ శంకర్ ఆఫీసులో ఉజ్వల్ కులకర్ణి దర్శనం ఇచ్చాడు. చాలా చిన్నగా ఉన్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసిన కులకర్ణి సినిమాను ఎడిట్ చేస్తున్నప్పుడు సర్ ఈ సీన్ ఇక్కడ రివిల్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడట. దాంతో హరీష్ శంకర్ కూడా అది చాలా బాగా అనిపించి సినిమా స్క్రీన్ ప్లే కూడా మార్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా చాలా చిన్న ఏజ్ లో పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు