Puri Jagannadh: మిస్టర్ బచ్చన్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా డబుల్ ఈ స్మార్ట్ సినిమాని ఆ దేవుడే కాపాడాలి

Puri Jagannadh: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నారు. ఒక్కొక్క దర్శకునికి ఒక్కొక్క శైలి ఉంటుంది. అలా పూరి జగన్నాథ్ విషయానికొస్తే హీరో క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా రాయగలడు. చాలావరకు పూరి జగన్నాథ్ సినిమాలన్నీ కూడా ఆ సినిమాలోని హీరో కనెక్ట్ అయినవి అని చెప్పాలి. పూరి సినిమాలో హీరో అంటేనే చాలా స్ట్రాంగ్ గా రెబల్గా మంచి ఆటిట్యూడ్ తో ఉంటాడు. ఓపెన్ గా మాట్లాడుకుంటే హీరో క్యారెక్టర్ కి ఒక సెపరేట్ ఆటిట్యూడ్ని క్రియేట్ చేసిన ఘనత పూరి జగన్నాథ్ కి దక్కుతుంది. పూరి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

ఇక పూరి జగన్నాథ్ నుంచి చివరగా వచ్చిన హిట్ సినిమా అంటే ఇస్మార్ట్ శంకర్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకునే టైంలో ఆ సినిమా హిట్ అయి మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఆ లాభాలు తో మరికొన్ని సినిమాలు చేశాడు పూరి జగన్నాథ్. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.

Double Ismart

- Advertisement -

ఈ సినిమాతో పాటు రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలలో ఎక్కువ క్యూరియాసిటీ మిస్టర్ బచ్చన్ సినిమా మీద ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. దానిని మించి డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కంటే కూడా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. అయితే కొన్ని సినిమాలు ట్రైలర్లు చూసినప్పుడే వాటి పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూస్తే చూడాలని ఆసక్తి కూడా పెద్దగా అనిపించట్లేదు అనేది వాస్తవం.

మిస్టర్ బచ్చన్ డామినేషన్

ఏదేమైనా ఎవ్వరు కూడా ఏ సినిమా పోవాలని కోరుకోరు. ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సెన్సార్లు పూర్తిచేసుకుని చాలా గ్రాండ్ గా ఆగస్టు 15 కి రిలీజ్ కానున్నాయి. ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన అంతవరకు కూడా సరైన క్లారిటీ రావట్లేదు. ఇక డబల్ ఇస్మార్ట్ శంకర్ పై మిస్టర్ బచ్చన్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. మౌత్ టాకుతో సినిమా వర్క్ అవుట్ అయితే గాని డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి చెప్పలేము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు