Harish Shankar: పోకిరి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకి ఎప్పటికీ చరిత్రలో ఒక స్థానం మిగిలి ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా అంటే మహేష్ బాబు నటించిన పోకిరి అని చెప్పాలి. ఈ సినిమాని పూరి జగన్నాథ్ డిజైన్ చేసిన విధానం వేరే లెవెల్ అని చెప్పాలి. కమర్షియల్ సినిమాకి అసలైన అర్థం చూపించిన సినిమా పోకిరి. ఈ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల విషయానికి వస్తే పోకిరి సినిమా మొదటి వరుసలో ఉంటుంది.

రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్, అలానే పూరి జగన్నాథ్ టేకింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫామెన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాకి ఎప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంటుంది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ అందించిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్. రీసెంట్గా దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో మాట్లాడుతూ మహేష్ బాబు గారితో సినిమా చేసే అవకాశం వస్తే పోకిరి లాంటి సినిమా చేస్తాను. ఆ సినిమా నాకో టెస్ట్ బుక్ లాంటిది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పోకిరి సినిమాకు వస్తే కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ మాట్లాడుతూ నన్ను అందరూ పోకిరి లాంటి సినిమా తీయండి అంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత నేనొక్కడినే కూర్చొని ప్రసాద్ ల్యాబ్లో పోకిరి సినిమా వేసుకుని చూశాను. అయినా కూడా అసలు నేనేం చేశానో నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. మామూలుగా పోకిరి సినిమా రిలీజ్ అవ్వడానికి అంటే ముందు చాలామంది పోకిరి సినిమాను చూశారు. చూసిన వారిలో ఎక్కువ శాతం మంది ఈ సినిమా అంతగా వర్కౌట్ అయ్యేటట్లు లేదు ఈ సినిమాలో పెద్దగా ఆడవాళ్ళు లేరు ఫ్యామిలీ సెంటిమెంట్స్ లేవు అంటూ కామెంట్ చేశారు. కానీ ఈ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను అందుకుంది.

- Advertisement -

Pokiri F

పోకిరి కైండ్ ఆఫ్ సినిమా

అయితే మ్యాజిక్ అనేది ఒక్కసారి మాత్రమే క్రియేట్ అవుతుంది. మ్యాజిక్ క్రియేట్ చేయాలి అనుకొని పని మొదలుపెడితే అది వర్కౌట్ కాకపోవచ్చు. హరీష్ శంకర్ కి ఉన్న టాలెంట్ కి మహేష్ బాబు డేట్స్ దొరికి సినిమా చేస్తే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే హరీష్ శంకర్ డైలాగ్ రైటింగ్, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ ఈ రెండూ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. వీరిద్దరూ కలిసి కాంబినేషన్లో సినిమా చేస్తే పోకిరి కైండ్ ఆఫ్ సినిమా తీయటం అనేది హరీష్ కు పెద్ద విషయం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు