Vs14: ఇన్నోసెంట్ విశ్వక్సేన్ ను చూస్తామా, లేదా అనుదీప్ పంథా మారుస్తాడా.?

Vs14: ఒక్కొక్క దర్శకుడు కి సినిమా పైన ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. అలానే ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన సినిమా తీయడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అతి సెన్సిటివ్ దర్శకులలో ప్రస్తుతం వినిపించే పేరు అనుదీప్ కేవీ అని చెప్పాలి. పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. అయితే ఆ సినిమా ఊహించిన సక్సెస్ను సాధించలేకపోయింది. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో ఏ దర్శకుడికి రానంత గుర్తింపును సాధించుకున్నాడు. చాలా ఇంటర్వ్యూస్ లో కనిపించిన అనుదీప్ కి సెపరేట్గా ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పాలి.

అనుదీప్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కువ రక్తపాతం, హింస ఇలాంటివి ఉండకుండా కేవలం జోయ్, కలర్ఫుల్ , ఫన్నీ గా ఉంటాయి. అనుదీప్ కె.వి లో చాలామంది ఇష్టపడేది ఇనో సెన్స్. అనుదీప్ సినిమాలలో హీరోలకు కూడా ఇది ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. జాతి రత్నాలు ప్రిన్స్ సినిమాలలో హీరోలు క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అయితే జాతి రత్నాలు సినిమా ఆడిన స్థాయిలో ప్రిన్స్ సినిమా సక్సెస్ సాధించలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్సేన్ తో సినిమా చేయనున్నాడు అనుదీప్. ఈ కాంబినేషన్ అసలు ఎవరు ఊహించలేదు.

Image

- Advertisement -

విశ్వక్సేన్ తన కెరియర్లో చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ చేశాడు. అలానే విశ్వక్సేన్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు అంటూ చాలామంది అంటుంటారు. అలానే విశ్వక్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి అది ఒక ఆనవాయితీలా మారిపోయింది. ఇక అనుదీప్ అంటే కాంట్రవర్సీకి కంప్లీట్ గా దూరంగా ఉంటాడు. అయితే వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు విశ్వక్ ఇన్నోసెంట్ గా కనిపిస్తాడా.? లేదంటే విశ్వక్ కోసం దర్శకుడు అనుదీప్ తన పంథాను మార్చుకుంటాడా అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు