Sarath Babu: రమప్రభే కాదు.. ఆమెను కూడా పెళ్లి చేసుకున్న శరత్ బాబు.. ఎవరంటే..?

Sarath Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు శరత్ బాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఈయన రమా ప్రభను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈమె ఆస్తిని పూర్తిగా వినియోగించుకున్న తర్వాత ఆమెను దూరం చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం రమాప్రభ చిత్తూరు జిల్లాలోని ఒక ఊరిలో కాలం గడుపుతోంది. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తూ ఉంటుంది. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా శరత్ బాబు మరణించిన సమయంలో మాత్రమే ఆమె మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా శరత్ బాబుకి రమా ప్రభ మాత్రమే కాదు ఇంకొక హీరోయిన్ కూడా భార్య అయిందట. ఇప్పుడు ఆమె మాటల్లోనే విందాం.

Sarath Babu: Not Ramaprabha. Sarath Babu who also married her.. Who..?
Sarath Babu: Not Ramaprabha. Sarath Babu who also married her.. Who..?

శరత్ బాబు భార్య కావాలనుకున్న స్టార్ హీరోయిన్..

ఒకానొక సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అంద చందాలతో యువతను ఉర్రూతలూగించి స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు, క్లాసికల్ డాన్సర్ జయలలిత గురించి చెప్పాల్సిన పనిలేదు. 80,90 ల్లో వందల సినిమాలు చేసిన ఈమె అడపాదడపా మాత్రమే. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అందులో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇన్ని రోజులు రమా ప్రభ మాత్రమే శరత్ బాబు భార్య అని అందరికీ తెలుసు. కానీ జయలలిత కూడా శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుందట. అయితే ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

వారి వల్లే పెళ్లి ఆగిపోయిందట..

జయలలిత తాజాగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శరత్ బాబును నేను, బావ అని పిలుస్తూ ఉంటాను. ఆయనతో ప్రేమలో పడిపోయా. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న గుడికి కూడా వెళ్ళాము. అయితే ఇండస్ట్రీలో ఎవరో వద్దన్నారు. దాంతో విడిపోయాము. అయితే మా ప్రేమలో నేను బలంగా ఉన్నాను. కానీ శరత్ బాబు మాత్రం నన్ను సగమే ప్రేమించారు. నేను ఆయనతో పిల్లల్ని కనాలి అనేంత వరకు ఆలోచించాను. కానీ జీవితంలో ఇల్లు, పెళ్లి, పిల్లలు అనేవి ఉండడానికి కూడా ఒక ప్రాప్తం అంటూ ఉండాలి కదా.. అవి నా జీవితానికి ఇక లేనట్టే. అందుకే నేను ఆయనను పెళ్లి చేసుకోలేకపోయాను అంటూ జయలలిత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఆరోజు ఎవరో వద్దని చెప్పకుండా ఉండుంటే, జయలలిత శరత్ బాబు రెండవ భార్య ఉండేదేమో.

- Advertisement -

వారు బెదిరించినా బెదరలేదంటున్న జయలలిత..

ఇక జయలలిత అసలు పేరు లలిత.. జయ అనే పేరును ఇండస్ట్రీ పెద్దలు జోడించారట. ముఖ్యంగా ఈ పేరుతో మద్రాస్ లో ఈమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. ఎందుకంటే అప్పటికే జయలలిత పేరుతో ఇంకొక హీరోయిన్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తమిళనాడులో ముఖ్యమంత్రి కూడా. అక్కడ ప్రజలు ఈమెను అమ్మా అని పిలుస్తారు. అలా అమ్మ పార్టీ వారు ఆమెను బెదిరించారట. అమ్మ పేరు పెట్టుకుని కామెడీ వేషాలు వేయడానికి వీలు లేదని హెచ్చరించారట. అయితే తాను మాత్రం బెదరకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాను అంటే చెప్పుకొచ్చింది జయ లలిత.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు