Shriya : తేజా సజ్జాకు జోడిగా శ్రియా.. ట్విస్ట్ అదిరింది.. ఏ పాత్రలో అంటే ?

Shriya : ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో ఒకరు శ్రియా శరన్. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. వయసు పెరుగుతున్నా చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. కుర్ర హీరోయిన్లు ఎంత మంది వచ్చినా తగ్గేదేలే అంటూ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. కానీ ఈమెకు మాత్రం ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై శ్రియా క్లారిటీ ఇచ్చారు..

తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్న ఆమె పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన విజయం అందుకున్నారు. ఆయన విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నా. నేను, ఆయన గతంలో ‘బాలు’ కోసం కలిసి వర్క్‌ చేశాం. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. శ్రమపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఆ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో ఆయన కాలికి గాయమైంది.. కానీ ఎవరికీ చెప్పలేదు. పని పూర్తయిన తర్వాతే అది చెప్పాడు. అలాంటి ఆయన ప్రజలకు కూడా సేవలు చేస్తాడని ప్రజలు నమ్ముతారని ఆమె అన్నారు.

Shriya Saran is acting in Teja Sajja movie
Shriya Saran is acting in Teja Sajja movie

ఇక శ్రియా ప్రస్తుతం ‘షో టైమ్‌’ అనే కార్యక్రమం కోసం వర్క్‌ చేస్తున్నానని చెప్పారు. బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయన్నారు. అలాగే హాలీవుద్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయని ఆమె చెప్పారు. ఇక తెలుగులో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. హనుమాన్ ఫేమ్ హీరో తేజా సజ్జా తో ఓ సినిమాలో నటించబోతుందని చెప్పింది. ఇండియన్ సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పింది. మరి తేజా తో ఏ సినిమాలో నటిస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన ఫ్యామిలీ గురించి, ట్రెండీ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి నెట్టింట ఎంతగా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తుంటాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు