HBD Fahadh Faasil..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుతమైన నటనతో విలన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ముఖ్యంగా ఎన్నో చిత్రాలలో ప్రేక్షకులను అలరించిన ఈయన పుష్ప చిత్రంలో విలన్ గా నటించి అందరిని అలరించారు. ప్రస్తుతం సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప -2 సినిమాలో విలన్ గా మరొకసారి అలరించనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన పుట్టినరోజు ఈరోజు. అయితే ఈ పుట్టినరోజు ఆయన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంగా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
ఇద్దరు ఇండియన్ సినీ పిల్లర్స్ మధ్య ఫహద్ బర్తడే వేడుకలు..
ఇద్దరు ఇండియన్ సినీ పిల్లర్స్ మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందని ఫహాద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు. తాజాగా రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం వెట్టయాన్. ఇందులో అమితాబ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఫహద్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఈరోజు ఫహాద్ పుట్టినరోజు కావడంతో అటు రజనీకాంత్ ఇటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈయన పుట్టినరోజును చాలా ఘనంగా జరిపించారు. అంతేకాదు ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
ఫహద్ ఫాజిల్ కెరియర్..
ఇక ఫహద్ ఫాజిల్ విషయానికొస్తే.. 2002లో కైయెతుమ్ దూరత్ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రానికి ఈయన తండ్రి , ప్రముఖ దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 2014లో ఆయన నిర్మించిన పెద్ద బడ్జెట్ చిత్రం అయోబింటే పుస్తకం లో నటించారు. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ బెంగళూరు డేస్ లో కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత తెలుగు, తమిళ్ అంటూ తేడా లేకుండా చాలా చిత్రాలలో హీరోగా విలన్ గా కూడా నటిస్తూ దూసుకుపోతున్నారు.
నజ్రియా తో ప్రేమ, పెళ్లి..
ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, మలయాళ సినీ నటి నజ్రియా నజీమ్ తో 2014 జనవరి 20న నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2014 ఆగస్టు 21న తిరువనంతపురంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఇకపోతే 2014లో వచ్చిన బెంగళూరు డే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీరిద్దరి వివాహానికి వారి తల్లిదండ్రులు అత్యంత కీలక పాత్ర పోషించారని ఫహాద్ చెప్పుకొచ్చారు. ఇక ఈయన భార్య నజ్రియా నజీమ్ రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఇటీవల రీయంట్రీ ఇచ్చి నాని సరసన అంటే సుందరానికి అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది తన అంద చందాలతో తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న నజ్రియా మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు.