Pushpa2 : సుక్కు, ఫహాద్ మధ్య గొడవలు నిజమేనా… బర్త్ డే సందర్భంగా ప్రూవ్ అయిందిగా..

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ పూర్తి కాలేదు. అందుకు కారణం డైరెక్టర్ తో హీరో, విలన్ కు గొడవలని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజమని తెలుస్తుంది. ఈరోజు ఫహాద్ ఫాసిల్ బర్త్ డే.. అయితే మిగిలిన సినిమా వాళ్లు అనౌన్స్ చేశారు. బర్త్ డే సర్ ప్రైజ్ లను ఇస్తున్నారు. కానీ పుష్ప 2 టీమ్ మాత్రమే బర్త్ డే సర్ ప్రైజ్ ను వదల్లేదు.. గతంలో ఈ టీం లోని ప్రముఖుల పుట్టినరోజు సందర్బంగా అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో గొడవలు నిజమే అని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

2020 లో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు నేషనల్ వైడ్ మంచి టాక్ వచ్చింది. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతుంది. మొదటి పార్ట్ కు మించిన విధంగా ఈ మూవీలో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా విలన్ గా ఫాహాద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.. డైరెక్టర్ సుకుమార్ కు, విలన్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయానే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ మధ్య దీనిపై ఎన్నో వార్తలు కూడా వినిపించాయి. అది నిజమని ఇప్పుడు తెలిసింది. ఇతని బర్త్ డే సందర్బంగా పొద్దున నుంచి ఒక పోస్టర్ కూడా పుష్ప టీమ్ రిలీజ్ చెయ్యలేదు. కనీసం విష్ చెయ్యలేదు. దాంతో గొడవలు నిజమని అభిప్రాయానికి వచ్చారు.

the fights between Sukku and Fahad real... It was proved on the occasion of the birthday
the fights between Sukku and Fahad real… It was proved on the occasion of the birthday

గతంలో దేవి బర్త్ డే కు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే బన్నీ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కానీ అతని పుట్టినరోజును పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఇప్పుడు విష్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారు చూడాలి.. పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు.. జాతీయ అవార్డును అందుకున్న నటుడు అల్లు అర్జున్. అప్పుడే తెరపై కనిపించి మూడేళ్ల దాటి పోయింది. పుష్ప 2 కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రం.. మరోసారి డిసెంబర్ బరిలో నిలుస్తుంది. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అయితే సినిమా షూటింగ్ ఇంకా 20 శాతం పెండింగ్ ఉందని తెలిసిందే.. షూటింగ్ పూర్తి అయి వచ్చేలోగా వచ్చే ఏడాది పడుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు