Mr Bacchan : మిస్టర్ బచ్చన్ లో మరో స్టార్ క్యామియో?

Mr Bacchan : టాలీవుడ్ లో ఆగష్టు 15న రాబోతున్న సినిమాల్లో ఎక్కువ అంచనాలున్నది ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకే అని తెలిసిందే. ఆరోజు పెద్దా చిన్నా కలిపి అరడజను క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ కి వారం రోజులే సమయం ఉండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక ఆల్రెడీ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి బజ్ ని తీసుకురాగా, లేటెస్ట్ గా మాస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసేసారు. ట్రైలర్ కట్ కూడా బాగా ఉండి ఆకట్టుకుంటుంది. ఇక చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇంకా చేస్తూ సినిమా కోసం అంచనాలు పెంచే పనిలో ఉన్నారు.

DSP cameo role in Mr Bacchan movie

మిస్టర్ బచ్చన్ లో మరో స్టార్ క్యామియో?

ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమాలో ఇదివరకు ఓ స్టార్ క్యామియో రోల్ లో నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతనెవరో కాదు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ. సిద్ధూ జొన్నలగడ్డ మిస్టర్ బచ్చన్ లో సెకండ్ హాఫ్ లో ఓ ఫైట్ సీన్ లోఒక 3 నిముషాల రోల్ ప్లే చేసాడట. హీరోతో కలిసి ఆ సీన్ ఉంటుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ కూడా క్యామియో రోల్ లో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అతను హీరో కాదు. మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. తాజాగా అందిన సమాచారం ప్రకారం డిఎస్పీ కూడా క్యామియో రోల్ లో నటించాడని వార్తలు వస్తున్నాయి. అయితే అది సాంగ్ లోనా? లేక సినిమాలో ఓ సన్నివేశంలోనా అన్నది క్లారిటీ లేదు. ఇక డిఎస్పీ తాను మ్యూజిక్ ఇచ్చిన చాలా సినిమాల్లో సాంగ్స్ లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కం బ్యాక్ ఇస్తారా?

ఇక రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ (Mr Bacchan) సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వా ప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటించగా, సచిన్ ఖడేకర్, శుభలేఖ సుధాకర్, కమెడియన్ సత్య, ప్రవీణ్, సత్యం రాజేష్, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పంద్రాగస్టున విడుదలయ్యే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని అనిపిస్తుంది. వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు ట్రేడ్ నెటిజన్లు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు