Sobhita Dhulipala : చై తో ఎంగేజ్మెంట్ తర్వాత వైరల్ అవుతున్న అక్కినేని కోడలి బోల్డ్ యాడ్… చూస్తే తట్టుకోలేరు?

Sobhita Dhulipala : టాలీవుడ్ లో ఎన్నాళ్ళనుండో వస్తున్న గాసిప్ ఈరోజు నిజమైంది. అక్కినేని నాగచైతన్య సామ్ తో విడాకుల తర్వాత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ వాళ్ళ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండగా, చై మాత్రం శోభిత ధూళిపాళ తో ప్రేమాయణం నడిపాడు. ఇది నిన్నటివరకు రూమర్ గానే ఉండగా, నేడు వీళ్ళ ఎంగేజ్మెంట్ తో నిజం అయింది. ఇక నాగ చైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ తో సోషల్ మీడియాలో అభినందనలు వస్తున్నా, ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ నుండి విమర్శలు కూడా వస్తున్నాయ్. ఇక సమంత ఫ్యాన్స్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఫైర్ అవుతారో చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా శోభితా ధూళిపాళ కి సంబంధించిన పలు వీడియోలు కూడా నేడు బాగా వైరల్ అవుతున్నాయి.

Sobhita Dhulipala's condom ad viral on social media

వైరల్ అవుతున్న శోభితా బోల్డ్ యాడ్..

ఇక నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఒక బోల్డ్ వీడియో బాగా వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ఒక కండోమ్ యాడ్. ఆ వీడియోలో ఉన్నది చైతూకు కాబోయే భార్య శోభితా ధూళిపాళయే. ఈ వీడియో వచ్చి చాలా రోజులే అయినా, ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇది తెలియక అక్కినేనికి కాబోయే కోడలు ఇలాంటి యాడ్స్ చేయడం ఏంటని నెట్టింట విమర్శలు, ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చై, శోభితాని ఈ వీడియోని అడ్డంగా పెట్టుకుని బాగా ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

 

మోడల్ గా ఇలాంటి యాడ్స్ చేసిన శోభిత..

అయితే శోభితా ధూళిపాళ హీరోయిన్ కాకున్నా ముందు మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇలాంటి యాడ్స్ ఎన్నో చేసింది. పైగా బికినీలో కూడా కొన్ని యాడ్స్ చేయడం గమనార్హం. ఏది ఏమైనా శోభితా పాత వీడియోలు ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుండగా, అక్కినేని అభిమానులు ఆ వీడియోలు చూసి తట్టుకోలేకపోతున్నారు. మరి అక్కినేని హీరోలు బయట ఎలా మొహం చూపిస్తారో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంతతో పెళ్లి అయినప్పుడు ఉన్నంత చైతన్యకు వచ్చిన ఎక్సయిట్మెంట్ ఇప్పుడు శోభిత తో నిశ్చితార్థం అయినపుడు తన కళ్ళల్లో కనిపించట్లేదని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు