Samantha – Trisha : దాంట్లో సక్సెస్ అయింది సామ్ తర్వాత త్రిషనే?

Samantha – Trisha : టాలీవుడ్ నుండి అలాగే సౌత్ నుండి గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్లు వివిధ వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ సహా ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో అలాగే హిందీలో కూడా పలు వెబ్ సిరీస్ లలో స్టార్ హీరోయిన్లు నటిస్తూ, సినిమాలతో సమానంగా బిజీ అయ్యారు. అందులో కొన్ని వెబ్ సిరీస్ లు మంచి విజయాన్ని నమోదు చేసాయి. అయితే స్టార్ హీరోయిన్లు ప్రధానంగా తెరకెక్కిన సిరీస్ లలో మాత్రం చాలా వరకు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఆయా హీరోయిన్లు నటించిన వెబ్ సిరీస్ లు వివిధ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవుతున్నా, అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. అయితే అందులో సమంత మాత్రమే విజయం సాధించింది.

Samantha - Trisha is successful in OTT platform

సామ్ మినహా అందరూ ప్లాప్..

అయితే అసలు విషయానికి వస్తే.. సౌత్ స్టార్ హీరోయిన్లు గత కొన్నాళ్లుగా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నా సమంత మాత్రమే వెబ్ సిరీస్ తో సక్సె సక్సెస్ అందుకుంది. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’. ఈ సిరీస్ ఓటిటి లో భారీ సక్సెస్ అయింది. దీని తర్వాత చాలా మంది స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లలో నటించారు. ఇప్పటివరకు డిజిటల్ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఇప్పటివరకు నాలుగు వెబ్ సిరీస్‌లలో (11న్త్ అవర్, నవంబర్ స్టోరీ, జీ కర్దా & ఆఖ్ రీ సచ్) నటించింది. కానీ ఒకటీ సక్సెస్ సాధించలేదు. అలాగే ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ తో కాజల్ అగర్వాల్, ‘షో టైమ్’ అనే సిరీస్ తో శ్రియా శరణ్, ఇంకా ‘బెస్ట్ సెల్లర్’ అనే వెబ్ సిరీస్ తో శృతి హాసన్ ఓటిటి లలో వెబ్ సిరీస్ లతో పలకరించారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ అవలేదు.

- Advertisement -

సామ్ తర్వాత త్రిషనే..

అయితే సమంత తర్వాత నలుగురు స్టార్ హీరోయిన్లు పలు వెబ్ సిరీస్ లలో నటించగా, అందరూ ప్లాప్స్ అందుకున్నారు. అయితే సామ్ తర్వాత ఇప్పుడు సక్సెస్ ని అందుకున్న హీరోయిన్ త్రిష కృష్ణన్ మాత్రమే. సమంత తర్వాత తృష్ణ కృష్ణన్ లేటెస్ట్ గా బృంద అనే వెబ్ సిరీస్ లో నటించింది. రీసెంట్ గా సోనీ లివ్‌ లో ఒక వారం క్రితం విడుదలైన త్రిష మొదటి వెబ్ సిరీస్ బృందా, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్-థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ లో త్రిష తన నటనతో ఎంతో ఆకట్టుకుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక సమంత తర్వాత వెబ్ సిరీస్ ద్వారా సక్సెస్ అందుకుని మెప్పించిన హీరోయిన్ త్రిషనే అని అంటున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు