OTT Movie : ప్రతి సంవత్సరం బాలీవుడ్లో ఎన్నో సినిమాలు తెరకెక్కుతాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అవుతాయి. రొమాంటిక్, సస్పెన్స్-థ్రిల్లర్, యాక్షన్ జానర్ సినిమాలు మాత్రం హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా చూస్తారు. నేటి కాలంలో సినిమాల్లో యాక్షన్ ఒక్కటే ఉంటే సరిపోదు ప్రేక్షకులకు సినిమాలను చూడాలనిపించే కంటెంట్ కూడా ఉండాలి. అయితే ఇలాంటి కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు మేకర్స్ చాలా వరకు బోల్డ్ అనే కేతగిరితో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి తట్రై చేస్తారు. అలా అశ్లీలత హద్దులు దాటిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు OTTలో లేదా YouTubeలో ఉచితంగా చూడటానికి అందుబాటులో ఉన్నాయి. ఆ చిత్రాలను ఒంటరిగా చూడటం మంచిది. ఎందుకంటే మీరు ఈ చిత్రాలను కుటుంబంతో చూడలేరు. వెబ్ సిరీస్‌లు చూసి బోర్ కొట్టి, బాలీవుడ్లో మసాలా సినిమా చూడాలనిపిస్తే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు మీ కోసమే.
లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా
లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా చాలా వివాదాల్లో కూరుకుపోయింది. ఇందులో కొన్ని అసభ్యకర సన్నివేశాలు కూడా ఉంటాయి. మీరు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. కొంకణా సేన్ శర్మ, రత్న పాఠక్, ప్లాబితా బోర్తకూర్, అహనా కుమార వంటి నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
బాబు మోషాయ్ బందూక్ బాజ్
బాబు మోషాయ్ బందూక్ బాజ్ మూవీలోని పలు సన్నివేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ అతను, బబితా బాగ్ మధ్య వచ్చే కొన్ని ఇంటిమేట్ సీన్స్ తెగ వైరల్ అయ్యాయి. మీరు ఈ చిత్రాన్ని చూడాలనుకుంటే Zee5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
రంగ్ రసియా
రంగ్ రసియా చిత్రంలో రణదీప్ హుడా, నందన సేన్ మధ్య చిత్రీకరించిన కొన్ని బో*ల్డ్ సన్నివేశాలను కుటుంబంతో కలిసి చూడలేరు. ఈ సినిమా ZEE5లో అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ మూవీని ఇంకా చూడకపోతే త్వరగా చూడండి. కానీ ఇంట్లో ఎవరూ లేనప్పుడే చూడాలని గుర్తుంచుకోండి.
మర్డర్
మర్డర్ మూవీని ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ మధ్య వచ్చే సీన్స్ ను ఒంటరిగా చూస్తే బెటర్. ఈ సినిమా పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు.
హవాస్
హవాస్ చిత్రం ఒక ఎరోటిక్ థ్రిల్లర్. ఇందులో అశ్లీలత హద్దులు దాటిపోయింది. MX Playerలో ఈ సినిమాని ఉచితంగా చూడవచ్చు. ఈ సినిమాలో మేఘనా నాయుడు పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
జిస్మ్ 2
ఇక బోల్డ్ సినిమాల లిస్ట్ లో మర్చిపోకుండా చూడాల్సిన మూవీ జిస్మ్ 2. ఇందులో సన్నీ లియోన్, రణదీప్ హుడా మధ్య చాలా అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఈ సినిమా పాటలు హిట్ అవ్వడంతో పాటు సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. మీరు ఈ చిత్రాన్ని Zee5లో ఆస్వాదించవచ్చు.