AlluArjun VS PawanKalyan : నువ్వు వీధి రౌడీవి, అమ్మాయిల వెంట తిరిగేవాడివి… పవన్ కి బన్నీ ఫ్యాన్స్ కౌంటర్

AlluArjun VS PawanKalyan : టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిపోతోందన్న మాట వాస్తవం అని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ దాదాపు దూరం పెడుతుందని తెలుస్తుంది. రీసెంట్ గా జరిగిన పలు ఈవెంట్స్ లో అల్లు అర్జున్ పేరుని మెగా ఫ్యామిలీ లో ఎవరూ వాడడం లేదు. సాయి దుర్గా తేజ్ బన్నీ ని అన్ ఫాలో అవడం, నిహారిక ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అందర్నీ గుర్తు చేసుకొని, బన్నీని మెన్షన్ చేయకపోవడం, అలాగే అల్లు ఫ్యామిలీ మెగా ట్యాగ్ కాకుండా అల్లు ట్యాగ్ ని మాత్రమే వాడుతుండడంతో వివాదం ముదిరిపోతోంది. ఇక మెగా – అల్లు అభిమానులు కూడా నెట్టింట ఈ వివాదం పై చెలరేగి ట్రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా నిన్న పవన్ కళ్యాణ్ పెట్టిన ఓ ప్రెస్ మీట్ లో బన్నీకి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసిన దానికి బన్నీ ఫ్యాన్స్, పవన్ పాత సినిమాల క్యారెక్టర్లు వెతికి మరీ కౌంటర్ వేస్తున్నారు.

Allu Arjun fans counter to PawanKalyan

నువ్వో వీధి రౌడీవి… బన్నీ ఫ్యాన్స్ కౌంటర్

ఇక పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా చేసిన కామెంట్లు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినవే అని నెట్టింట దుమారం రేగిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో అటవీ పరిరక్షణ.. గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ.. “ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు… ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ్ చేసే పాత్రల్లో హీరోలు నటిస్తున్నారు”… అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఈ మాటలు బన్నీ పుష్ప ని ఉద్దేశించినవే అని తెలుస్తూనే ఉంది. దీంతో అల్లు అర్జున్ ని ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసాడని అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పాత సినిమాలని వెతికి మరీ ఆయన చేసిన పాత్రలతో ట్రోల్ చేస్తున్నారు. ఆయన స్మగ్లర్ అయితే.. నువ్వొక వీధి రౌడీవి.. అమ్మాయిల పిచ్చిన్నోడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు..

- Advertisement -

పవన్ పాత్రల్ని వెతికి మరీ ట్రోల్ చేస్తున్నారు..

ఇక బన్నీ కి కౌంటర్ వేసినందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెతికి మరీ పవన్ కళ్యాణ్ పాత సినిమాల పాత్రల్ని తీస్తూ పికె ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పుష్ప లో స్మగ్లర్ పాత్ర చేస్తే.. మీరు చేసిందేంటి.. ఓ సినిమాలో (గోకులంలో సీత) అమ్మాయిల పిచ్చి ఉన్న రోల్, మరో సినిమాలో (జాని) వీధి రౌడి గా, ఇంకో సినిమాలో (పంజా) కాంట్రాక్ట్ కిల్లర్ గా నటించారు. మరి మీరు సమాజానికి ఏం మెసెజ్ ఇవ్వాలని ఇలాంటి సినిమాలు చేసారు పవన్ గారూ.. అంటూ నెట్టింట అల్లు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమాలు చేసినా క్లైమాక్స్ లో ఓ మెసేజ్ ఉంటుందని అందరికి తెలిసిందే. ఏది ఏమైనా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో పీక్స్ కి చేరుకున్నాయి. ఈ దూరాన్ని దగ్గర చేయడానికే అల్లు అరవింద్ గట్టి ప్లాన్ వేస్తున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు