Indian2 : రిస్క్ ఎందుకని ఓటిటి లో కూడా అదే ప్రింట్ తీసుకొచ్చారట!

Indian2 : ఈ ఇయర్ భారీ అంచనాలతో విడుదలైన సినిమాల్లో ఇండియన్2 కూడా ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఇండియన్ జేమ్స్ కెమెరూన్ గా పిలువ బడే శంకర్ షణ్ముగం దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కిందని తెలిసిందే. 28 ఏళ్ళ కింద వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2” తెరకెక్కగా, జులై 12న విడుదలైన ఈ సినిమా ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ సొంతం చేసుకోలేకపోయింది. బోరింగ్ స్క్రీన్ ప్లే వల్ల, పాత కథనే తిప్పి కొట్టడం వల్ల డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 160 కోట్ల వరకు మాత్రమే రాబట్టి ఎండ్ అయింది. ఇదిలా ఉండగా ఇండియన్2 సినిమాను తాజాగా ఓటిటి లో రిలీజ్ చేయడం జరిగింది.

Indian2 movie was also released in OTT in a cut version

రిస్క్ ఎందుకని అలా రిలీజ్ చేసేసిన మేకర్స్…

ఇక ఇండియన్2 సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా దారుణంగా వచ్చాయి. కనీసం నెల రోజులు ప్రభావం చూపాల్సిన సినిమా థియేటర్ల వద్ద రెండు వారాలకే పరుగు ముగించింది. ఇదిలా ఉండగా తాజాగా ఇండియన్2 సినిమా ఫైనల్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. మరి కొన్ని రోజుల తర్వాత రావాల్సిన ఈ సినిమాను థియేటర్లో ఊహించని డిజాస్టర్ అవడంతో, ప్రేక్షకులకు ఆసక్తి తగ్గే లోపే ముందుగానే ఓటిటిలోకి రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో ముందుగా 3 గంటల నిడివితో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కానీ నిడివి విషయంలో ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ రావడంతో మేకర్స్ 15 నిమిషాల నిడివి తగ్గించారు. అయితే ఇప్పుడు ఓటీటీలో కూడా ఆ కట్ చేసిన వెర్షన్ నే అందుబాటులోకి తీసుకొచ్చారట. దీంతో ఇండియన్2 ఓటిటి లో 2 గంటల 45 నిమిషాలు పాటు స్ట్రీమింగ్ అవుతుంది.

- Advertisement -

ఇండియన్3 కి ఎప్పుడు?

ఇక ఇండియన్2 సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేయగా, సౌత్ ఇండియా భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో నటించగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని, సూరి, ఎస్. జె. సూర్య, బాబీ సింహా తదితరులు నటించారు. ఇక ఇండియన్3 సినిమా 2025 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందించగా, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు