Committee Kurrollu Twitter Review : కమిటీ కుర్రాళ్ళు మూవీ ట్విట్టర్ రివ్యూ… నిహారికకు గుడ్ టైం వచ్చిందా..?

Committee Kurrollu Twitter Review : ప్రస్తుతం రాబోతున్న చిన్న సినిమాల్లో కొంతమేరకు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమాతో చాలామంది యూట్యూబర్స్ వెండి తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాను మెగా ప్రిన్సెస్ నిహారిక నిర్మించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడుగా మారాడు. యాదు వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాలోని విలేజ్ బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ ను చూపించారు. ఈ సినిమాలో కొంతమంది కుర్రోళ్ళు తమ బాల్య జీవితాన్ని ఎలా గడిపారు అని అనేక అంశాలను చూపించి మంచి నోస్ట్రాలజీ ఫీల్ క్రియేట్ చేశారు. ఈ సినిమా 90 కిడ్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక విలేజ్ లో అందరూ బాగా కలిసి ఉండి బాగా మాట్లాడుకునే స్నేహితులు ఒక చిన్న కులానికి సంబంధించిన గొడవ వలన ఎలా విడిపోయారు. ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఏంటి అని చూపించాడు దర్శకుడు. సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మంచి ఫన్ తో ఉంది. సెకండ్ ఆఫ్ సంబంధించి కొంతమేరకు అక్కడక్కడ లాక్ సీన్స్ ఉన్నా కూడా బానే ఉంది అని చెప్పాలి.

Committee Kurrollu

- Advertisement -

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో మెగా ఫ్యామిలీ టైం చాలా బాగా నడుస్తుంది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం. మెగాస్టార్, రామ్ చరణ్ తేజ్ అవార్డులు తీసుకోవడం ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తున్నాయి. అయితే ఇప్పుడు నిర్మాతగా నిహారిక కూడా ఈ సినిమా కలిసి వచ్చింది అని చెప్పాలి. ముందు టీవీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తర్వాత సినిమాల్లో ప్రూవ్ చేసుకోవడానికి హీరోయిన్ గా కూడా చేసింది. అయితే ఆ సినిమాలేవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నిహారిక తండ్రి నాగబాబు కూడా నిర్మాతగా కొన్ని సినిమాలు చేశాడు. అవి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. నిర్మాతగా నిహారిక మొదటి అడుగు పాజిటివ్ గా ఉంది తర్వాత ఏమవుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు