Saripodhaa Sanivaaram : కావాల్సినంత హైప్ వచ్చేసింది.. ఎటొచ్చి నానికి అడ్డుగా ఉంది అతనొక్కడే?

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో అతి త్వరలో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ సినిమాల్లో ‘సరిపోదా శనివారం’ కూడా ఒకటి. నాని కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి తర్వాత నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ సినిమా ప్లాప్ అయినా, రిలీజ్ తర్వాత అండర్రేటెడ్ క్లాసిక్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ‘స‌రిపోదా శ‌నివారం’ సినిమా షూటింగ్ కూడా ముగించుకుని, వ‌రుస అప్డేట్స్, ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అయితే తెలుగు సరిపోదా శనివారానికి భారీగా హైప్ ఉంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్లు కావాలిగా. అందుకే త్వరగానే మేకర్స్ వేరే భాషల్లో ప్రమోట్ చేయనున్నారు.

Nani's Saripodhaa Sanivaaram VS Thalapathy Vijay Greatest of All time

నానికి అడ్డుగా ఉంది ఈ స్టారే?

ఇదిలా ఉండగా నాని సరిపోదా శనివారం సినిమాకి ఓ స్టార్ హీరో మాత్రం అడ్డుపడుతున్నాడు. అతనెవరో కాదు.. తలపతి విజయ్. అవును… విజయ్ నటించిన ది గోట్ సినిమా, సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నాని సినిమాకి విజయ్ సినిమాకి కేవలం వారం రోజులే గ్యాప్ ఉంటుంది. తెలుగు వరకు నానికి సమస్య లేకపోయినా, తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ విజయ్ సినిమా అడ్డు వస్తుంది. ఎంత నాని సినిమా అయినా విజయ్ సినిమా ఆ తర్వాత వారం వస్తుంది అంటే… తమిళనాడు బయ్యర్లు నాని సినిమా తీసేసి విజయ్ సినిమా వేస్తారు. పైగా విజయ్ ఫ్యాన్స్ తమ హీరో సినిమా ఎలా ఉన్నా, కొన్ని రోజుల పాటు ఎవరి సినిమాను పట్టించుకోరు. పైగా కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా విజయ్ సినిమా హవా ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ సినిమాకు బాగానే ఎగబడుతున్నారు. అందువల్ల నాని సరిపోదా శనివారానికి విజయ్ సినిమా అడ్డు పడుతుందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

రెండింట్లో దేనికి ఓటు?

అయితే సరిపోదా శనివారం సినిమా ఏం తక్కువ కాదు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తమిళ్ స్టార్ ఎస్.జె. సూర్య మెయిన్ విలన్ గా చేయడంతో కోలీవుడ్ ట్రేడ్ లోనూ మంచి డిమాండ్ నెలకొంది. పైగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. తమిళ్ లో కూడా టీజర్, ప్రోమోలు కూడా ఆకట్టుకున్నాయి. ఇటు గోట్ పరిస్థితి చూస్తుంటే, రీసెంట్ గా పాటల పరంగా బాగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ వాడి గోట్ లో విజయ్ వయసుని అమాంతం తగ్గించగా, అది కూడా ట్రోల్ అవుతుంది. అయితే తమిళనాడు లో యానానిమస్ గా సరిపోదా శనివారం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తప్ప.. ఆ సినిమా పోటీని తట్టుకోవడం కష్టమని అంటున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు