OG: ఓజీ సినిమాకు డేట్స్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్, సుజీత్ సంభవం మొదలు

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరియర్ లో చేసినవి తక్కువ సినిమాలు అయినా కూడా కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మామూలుది కాదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఒక రకమైన పండగ వాతావరణం నెలకొంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే టికెట్ దొరకడం కూడా చాలా కష్టమైన పని. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో చేసింది చాలా తక్కువ సినిమాలైనా కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమని చెప్పొచ్చు. సినిమాలు ఫెయిల్ అవుతున్న కొద్ది పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పెరుగుతూ వచ్చింది.

ఒక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమాలో గ్యాప్ ఇచ్చి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత చాలా సినిమాలను ఒప్పుకున్నాడు. అయితే ఆ సినిమాలలో మూడు సినిమాలు రిలీజ్ కూడా అయిపోయాయి. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి దాదాపు 15 నుంచి 20 రోజులు షూటింగ్ మాత్రమే పవన్ కళ్యాణ్ ది పెండింగ్ లో ఉంది. దీనికోసం అక్టోబర్ నెలలో దాదాపు రెండు వారాలు పాటు డేట్స్ ఇవ్వనున్నట్లు ఈ సినిమా అక్టోబర్ లో పూర్తి అయిపోతే అతి త్వరలో రిలీజ్ చేయడానికి కూడా టీం సిద్ధంగా ఉంటుంది.

PawanKalyan

- Advertisement -

ఓ జి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, భగత్ సింగ్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓజి సినిమా తర్వాత ఈ సినిమాలకు పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైం లో సుజీత్ చేసిన హడావిడి కూడా అప్పట్లో వైరల్ గా మారింది. ఇప్పుడు ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో సుజీత్ కి తెలుసు. ఖచ్చితంగా ఓజి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు