Balakrishna : బాలయ్య డిజాస్టర్ సినిమా స్టోరీ ముందుగా ఆ స్టార్ దగ్గరికెళ్లిందా?

Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ మూడేళ్ళ ముందు వరకు కెరీర్ లో సినిమాల పరంగా చాలా డౌన్ అయిన సంగతి తెలిసిందే. లెజెండ్ తర్వాత సక్సెస్ లేని బాలయ్య ఏ సినిమా చేసినా ప్లాప్ అన్న మాటే తప్ప కనీసం యావరేజ్ రెస్పాన్స్ కూడా తెచ్చుకోలేదు. ఇక 2019 లో అయితే ఏకంగా మూడు డిజాస్టర్లు అందుకుని డీలా పడ్డాడు. ముఖ్యంగా ఆ ఏడాది మూడు సినిమాలు చేసిన బాలయ్య అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ ని “రూలర్” అనే సినిమాతో అందుకున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలవగా, అభిమానులను తలెత్తుకోకుండా చేసిన ఈ సినిమా ఊహించని ఫలితాన్ని మూటగట్టుకుంది. పైగా లుక్స్ పరంగా బాలయ్యపై కూడా ఎన్నో విమర్శలు వచ్చేలా చేసింది. అయితే నిజానికి ఈ సినిమా బాలయ్య చేయాల్సింది కాదట.

Gopichand is the first choice for Balakrishna Ruler movie

బాలయ్య స్టోరీ ముందు ఈ హీరో దగ్గరికెళ్లిందా?

అయితే బాలయ్య కెరీర్ లో మాయని మచ్చగా నిలిచిన రూలర్ సినిమా నిజానికి వేరే హీరో చేయాల్సిందట. అవును… రూలర్ కథని ముందుగా మ్యాచో స్టార్ గోపీచంద్ తో చేయాలి అని అనుకున్నారట. ఈ సినిమా డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ ఈ కథని గోపీచంద్ కి వినిపించగా, ఆల్ మోస్ట్ ఓకే అనగా ఎందుకో డౌట్ లో పడ్డాడట. కానీ అదే టైం లో సంపత్ నంది సీటిమార్ కథను వినిపించగా గోపీచంద్ రూలర్ ని రిజెక్ట్ చేసాడట. దీంతో రూలర్ కథని కె.ఎస్. రవికుమార్ బాలయ్యకి వినిపించాడట. అయితే అప్పటికీ బాలయ్య కూడా బి. గోపాల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి అనుకుంటుండగా, అప్పటికీ కథ సిద్ధం కాకపోవడంతో, అప్పటికే కె. ఎస్ రవికుమార్ రూలర్ స్క్రిప్ట్ ని బాలయ్య దగ్గరికి తీసుకెళ్లగా వెంటనే బాలయ్య ఒకే చేసారు. ఈ విధంగా గోపీచంద్ భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నాడు.

- Advertisement -

బాలయ్య కెరీర్ లోనే చెత్త సినిమాగా రూలర్..

ఇక బాలకృష్ణ రూలర్ సినిమా తన కెరీర్ లోనే చెత్త సినిమాల్లో ఒకటిగా నిలవగా, భారీ నష్టాలు కూడా తెచ్చి పెట్టింది ఆ సినిమా. ఇక గోపీచంద్ ఆ సినిమా నుండి తప్పించుకుని సంపత్ నంది తో సీటిమార్ చేసి యావరేజ్ సినిమా అందుకున్నాడు. అయితే ఆ రూలర్ సినిమా డిజాస్టర్ తర్వాత బాలయ్య రెండేళ్లు గ్యాప్ తీసుకుని “అఖండ” తో వచ్చి అఖండ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇక త్వరలో బాలకృష్ణ బాబీ కొల్లి తో చేస్తున్న NBK109 సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు