HBD MaheshBabu : మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇన్ని సినిమాల్లో నటించాడా..!

HBD MaheshBabu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా అభిమానులని అలరిస్తున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఘట్టమనేని కృష్ణ వారసుడిగా పరిచయమై, అచిరకాలంలోనే ప్రిన్స్ మహేష్ బాబుగా, ఆపైన సూపర్ స్టార్ గా కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ, మహేష్ బాబు సినీ ప్రియుల్ని అలరిస్తున్నాడు. ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు, ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు కూడా క్రియేట్ చేసాడు. అన్నిటికీ మించి ఎంతో మంది చిన్నారులను కాపాడి వాళ్లకు దేవుడయ్యాడు. ఇప్పటికి తన ఛారిటీల ద్వారా మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనస్సులో రియల్ సూపర్ స్టార్ గా నిలిచిపోయాడు. ఇక నేడు ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ఫిల్మీ ఫై తరపున ఆయనకు బర్త్ డే విషెస్ ని తెలియచేస్తున్నాము.

ఇకపోతే మహేష్ బాబు నటించిన పలు సినిమాలు నెట్టింట ట్రెండ్ అవుతుండగా, మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాల గురించి కూడా చర్చ నడుస్తుంది. చాలా మంది మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండో మూడో సినిమాలు చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ మహేష్ బాబు బాలనటుడిగా చేసిన సినిమాల లెక్క ఎక్కువే ఉంది.

List of movies starring  MaheshBabu as a child artist

- Advertisement -

ఒకసారి మహేష్ బాబు బాలనటుడిగా నటించిన సినిమాల లిస్ట్ చూస్తే…

నీడ (1979) :

మహేష్ బాబు మొదటిసారిగా వెండితెరపై కనిపించిన సినిమా ‘నీడ’. ఈ సినిమాను దాసరినారాయణ రావు తెరకెక్కించగా మహేష్ బాబు అన్న రమేష్ బాబు ప్రధాన పాత్రలో నటించగా, తన చిన్నప్పటి పాత్రను మహేష్ బాబు పోషించారు.

పోరాటం (1983) :

1983లో వచ్చిన పోరాటం సినిమాను S. రామచంద్రరావు నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ, జయ సుధ జంటగా నటించగా, మహేష్ బాబు బుజ్జి పాత్రలో బాలనటుడిగా నటించాడు.

శంఖారావం (1987) :

సూపర్ స్టార్ కృష్ణ నటించిన శంఖారావం 1987లో పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్‌పై యు. సూర్యనారాయణ బాబు నిర్మించగా, కృష్ణ స్వీయ దర్శకత్వం వహించారు. ఇందులో కృష్ణ విజయ్ ద్విపాత్రాభినయం చేయగా, రాజా పాత్రలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.

బజార్ రౌడీ (1988) :

కృష్ణ తనయుడు రమేష్ బాబు హీరోగా నటించిన బజార్ రౌడీ 1988 లో వచ్చింది. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్‌ గా మహేష్ బాబు నటించాడు.

ముగ్గురు కొడుకులు (1988) :

1988లో తెరకెక్కిన ముగ్గురు కొడుకులు సినిమాను పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కగా, ఈ చిత్రంలో ఫణీంద్రగా కృష్ణ, రాజేంద్రగా రమేష్ బాబు, సురేంద్రగా మహేష్ బాబు నటించారు. ఈ ముగ్గురూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే.

గూడాచారి 117 (1989) :

గూడాచారి 117 సినిమా కృష్ణ హీరోగా 1989లో తెరకెక్కగా, శ్రీ విజయ్ కళ్యాణ్ మూవీస్ బ్యానర్‌పై C. H. గాంధీ మరియు D. మురళి నిర్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇందులో కృష్ణ చంద్రకాంత్ గా నటించగా, భానుప్రియ ద్విపాత్రాభినయంలో నటించింది. ఇక మహేష్ బాబు చిన్నా అనే పాత్రలో నటించాడు.

కొడుకు దిద్దిన కాపురం (1989) :

కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన “కొడుకు దిద్దిన కాపురం” సినిమా 1989లో కృష్ణ తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పైనే నిర్మించగా కృష్ణ, విజయశాంతి జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో వినోద్ & ప్రమోద్ గా మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

అన్న తమ్ముడు (1990) :

1990లో సూపర్ స్టార్ కృష్ణ తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించి దర్శకత్వం అన్నాతమ్ముడు సినిమాలో రాజా కృష్ణ ప్రసాద్‌ గా కృష్ణ, మురళి గా మహేష్ బాబు నటించాడు.

బాలచంద్రుడు (1990) :

మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన బాలచంద్రుడు సినిమా 1990లో తెరకెక్కగా, కృష్ణ తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో బాలచంద్రుడిగా మహేష్ బాబు, సత్యనారాయణ, గీత, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మహేష్ బాబు బాలనటుడిగా నటుడిగా నటించిన చివరి చిత్రం ఇదే. మొత్తంగా మహేష్ బాబు 9 చిత్రాల్లో నటించగా, తొమ్మిదేళ్ల అనంతరం రాజకుమారుడు సినిమాతో 1999 లో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ గా అభిమానులను అలరిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు