Allu Arjun : ఏసియన్‌తో బన్నీ విభేధాలు… AAA విషయంలో అసంతృప్తి..

Allu Arjun : సినీ తారలు సినిమాలు మాత్రమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేస్తున్నారు. అందులో పలువురు స్టార్స్ మాత్రం సొంతంగా సినిమా హాల్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. మహేష్ బాబు ఏఏంబి సినిమాస్ పేరుతో మల్టీఫ్లెక్స్ ను ప్రారంభించారు. అదే దారిలో అల్లు అర్జున్ నడిచాడు. గతంలో అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో మల్టీఫ్లెక్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కొన్ని కారణాలు వల్ల ఏషియన్ సంస్థతో పార్ట్నర్ షిప్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలేమైంది? ఎందుకు విడిపోతున్నాడో వివరంగా తెలుసుకుందాం..

ఏషియన్ సినిమాస్ తో మహేష్ బాబు ఏఎంబి..

మహేష్ బాబు ఏఎంబీ పేరుతో థియేటర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా మెహబూబ్ నగర్‌లో ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఓ థియేటర్‌ను నిర్మించారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ తో పార్ట్నర్షిప్ అంటే మామూలు విషయం కాదు. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే నెంబర్ వన్ సినిమాస్ గా కొనసాగుతుంది. ప్రతి సినిమా ఈవెంట్ ను అక్కడే నిర్వహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఏఎంబి ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మంచి పాపులరీటిని సొంతం చేసుకోవడమే కాదు. మంచి లాభాలను అందుకుంటుంది. ఏషియన్ గ్రూప్ కూడా ఈ మల్టీ ఫ్లెక్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..

Bunny differences with Asian... Allu Arjun to cancel AAA partner ship
Bunny differences with Asian… Allu Arjun to cancel AAA partner ship

ఏషియన్ సినిమాస్ తో అల్లు అర్జున్ కు విబేధాలు..

ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏషియన్ తో కలిసి మహేష్ బాబుతో పాటుగా అల్లు అర్జున్ కూడా ఒక మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఏషియన్ సత్యం మాల్ వెలిసింది. ఇందులో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ థియేటర్‌ను కూడా నిర్మించారు. ఈ థియేటర్ జూన్ 15వ తేదీన ప్రారంభం అయ్యింది. అయితే ఆ థియేటర్ లో అనుకున్న లాభాలు అందుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ ఏషియన్ తో పార్ట్నర్ షిప్ ను క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థ కేవలం మహేష్ బాబు ఏఎంబి పైనే ఫోకస్ పెట్టడమే అందుకు కారణం అని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ త్వరలోనే ఆ సంస్థతో పార్ట్నర్షిప్ ను రద్దు చేసుకొని కొత్తగా థియేటర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఆ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ వార్త గురించి త్వరలోనే క్లారిటీ రానుంది.

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక మహేష్ బాబు రాజమౌళితో సినిమా చెయ్యనున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని టాక్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు