NTRNeel Release Date : సంక్రాంతికే వస్తున్న ఎన్టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ మూవీ… ఇక ఫ్యాన్స్‌ కు పండగే

NTRNeel Release Date : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్… ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే దేవర సినిమాను దాదాపుగా ఫినిష్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ సినిమాను గాడిలో పెట్టాడు.

ఎప్పటినుంచో ఈ సినిమా ప్రారంభం అవుతుందని అందరూ చర్చించుకున్నారు. అయితే శుక్రవారం అంటే నేడు సైలెంట్ గా ఈ సినిమా ప్రారంభించేశారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్. ఇవాళ శుక్రవారం కావడంతో ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించింది చిత్ర బృందం. రామానాయుడు స్టూడియోలో ఈ వేడుక చాలాగ్రాండ్ గా జరిగిందని సమాచారం.

అయితే ఈ సినిమా పూజా కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

- Advertisement -

Crazy update from NTR Prashant Neel movie.. Shocking comments from fans

ఈ సినిమాను వచ్చే సంవత్సరం జూన్ 9వ తేదీన… రిలీజ్ చేయబోతున్నట్లు… అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ ప్రకటన చేశారు. అంటే వచ్చే సంక్రాంతి పండుగకు… జూనియర్ ఎన్టీఆర్ సినిమా రెడీ అవుతుందన్నమాట. దీంతో సంక్రాంతి పండగకు మంచి.. మసాలా సినిమా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కాగా ఈ సినిమాలో ఇంకా నటుల పేర్లు ఫైనల్‌ కాలేదు. అటు జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు