Allu Arjun VS Asian : ఈగో మ్యాటర్స్… సొంతంగా థియేటర్స్ ఓపెన్ చేయబోతున్న బన్నీ..

Allu Arjun VS Asian : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలానే కాదు పలు వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. అందులో ఒకటి AAA సినిమాస్. ప్రముఖ సంస్థ ఏషియన్ గ్రూప్ తో కలిసి ఈ సినిమాస్ ను ఇటీవలే ప్రారంభించారు. అమీర్ పేట్ లోని అల్లు అర్జున్ భాగస్వామ్యంతో ‘ఏఏఏ సినిమాస్’ అనే వరల్డ్ క్లాస్ థియేటర్‌ను కూడా నిర్మించారు. గత ఏడాది ఈ సినిమాస్ ను గ్రాండ్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాస్ కు మొదట్లో వచ్చిన ఆదరణ ఇప్పుడు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా దీంతో పార్ట్నర్షిప్ ను రద్దు చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

AAA సినిమాస్..

ఏషియన్ సత్యం మాల్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మురళీ మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే.. మొత్తం ఐదు స్క్రీన్లు ఉండనున్నాయి. అయితే ఈ సినిమాస్ లో కూడా ఐమాక్స్ స్క్రీన్ లేదని తెలుస్తుంది. గత ఏడాది ప్రారంభమైన ఈ థియేటర్ లాభాలు అంతంత మాత్రనే ఉన్నట్లు అల్లు అర్జున్ సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

Bunny quarrels with Asian Bunny is going to open theaters on his own.
Bunny quarrels with Asian Bunny is going to open theaters on his own.

ఏషియన్ vs అల్లు అర్జున్ గొడవలు..

ఏషియన్ సినిమాస్ మహేష్ బాబు తో కలిసి ఎఎంబి సినిమాస్ ను ప్రారంభించారు. AAA తో పోలిస్తే AMB సినిమాస్ బాగా నడుస్తుంది. ఏషియన్ గ్రూప్ కూడా దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం వల్లే అల్లు అర్జున్ అలిగినట్లు తెలుస్తుంది.. అందుకే ఈ విషయం పై ఆ సంస్థతో బన్నీ చర్చలు జరిపినా పెద్దగా ప్రయోజనాలు కనిపించలేదట. దాంతో కోపంతో వారితో పార్ట్నర్ షిప్ ను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట..

- Advertisement -

సొంతంగా థియేటర్స్ ఓపెన్ చేయబోతున్న బన్నీ..

బన్నీ ప్రస్తుతం పలు బిజినెస్ లు చేస్తున్నాడు. అందులో ఒకటి AAA సినిమాస్.. ఏషియన్ గ్రూప్ తో కొన్ని విభేదాలు రావడంతో ఇగో హర్ట్ అవ్వడంతో బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సొంతంగా థియేటర్స్ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అక్టోబర్ 10 న అల్లు రామలింగయ్య బర్త్ డే సందర్బంగా కొత్తగా థియేటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఏకంగా నాలుగు థియేటర్లను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ బన్నీ థియేటర్స్ ను ఓపెన్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు