Star Anchors : ఆ యాంకర్ల భర్తల గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఏం చేస్తారో తెలుసా?

Star Anchors : టాలీవుడ్ ఇండస్ట్రీలో వెండి తెరపై కనిపించే నటీనటుల కన్నా కూడా బుల్లితెర పై కనిపించే యాంకర్స్ కు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజులో వెండితెర తో పాటు బుల్లితెర కూడా దూసుకుపోతుంది అద్భుతమైన రియాలిటీ షోలు స్పెషల్ ప్రోగ్రామ్ లు, సీరియల్స్ తో బుల్లితెర సత్తా చాటుతుంది నిర్మాణ విలువలు కూడా భారీగా పెరిగాయి.. ఈ మధ్య హీరోయిన్ల కన్నా ఎక్కువగా యాంకర్స్ సంపాదిస్తున్నారు. అయితే వాళ్లే కాదు వాళ్ల భర్తలు కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఏ యాంకర్ భర్త ఎంత సంపాదిస్తున్నారో.. అసలు ఏం చేస్తున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఉదయభాను..

Do you know what the husbands of those anchors are doing?
Do you know what the husbands of those anchors are doing?

యాంకర్ ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె కేరీర్ విషయానికొస్తే.. వేణుమాధవ్ తో కలిసి వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రాం కి యాంకర్ గా వ్యవహరించిన ఉదయభాను ఆ తర్వాత సాహసం చేయరా డింభకా, లక్కీ లక్ష్మి, రేలా రే రేలా వంటి ఎన్నో ప్రోగ్రాములకు యాంకర్ గా చేశారు.పలు సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రను పోషించారు. అయితే ఆమె విజయ్ అనే ఒక బిల్డర్ ను పెళ్లి చేసుకున్నారు. 2016 లో ఆమె ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చారు. అతను బిజినెస్ లు కూడా చేస్తున్నారు. ఇక ఉదయభాను స్క్రీన్ పై పెద్దగా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది.

శ్యామల..

Do you know what the husbands of those anchors are doing?
Do you know what the husbands of those anchors are doing?

యాంకర్ శ్యామల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చీరకట్టు అందాలతో ప్రేక్షకుల మతులు పోగొట్టే శ్యామల నటుడు నరసింహ ని పెళ్లి చేసుకున్నారు.ఈమె సినిమాల్లో కూడా నటిస్తుంటారు. తన భర్త సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు బిజీగా గడుపుతున్నారు.

- Advertisement -

లాస్య..

Do you know what the husbands of those anchors are doing?
Do you know what the husbands of those anchors are doing?

యాంకర్ లాస్య.. ఈమె చేసింది తక్కువ షోలే అయిన మంచి పాపులారిటిని సొంతం చేసుకుంది. ఈమె పెళ్లి తర్వాత యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన మంజునాథ ని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు..

శిల్పా చక్రవర్తి..

Do you know what the husbands of those anchors are doing?
Do you know what the husbands of those anchors are doing?

యాంకర్ శిల్పా రెడ్డి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఈమె కూడా బిజీ యాంకర్ గా రాణించింది. పలు సినిమా వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు.. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు, బుల్లి తెరకు దూరం అయ్యింది. ఆమె కల్యాణ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆతర్వాత ఇద్దరు పిల్లలకు అమ్మగా మారిపోయింది.. అతను ప్రముఖ ఛానెల్స్ కు ఎడిటర్ గా వ్యవహారిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు