Chay Sam : నాగ చైతన్య – సమంత మళ్లీ కలవబోతున్నారా..? ఇది అభిమానులకు గుడ్ న్యూస్..

Chay Sam : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ నాగ చైతన్య, శోభిత దూలిపాళ్ల ఎంగేజ్మెంట్.. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నా మౌనంగా ఉంటున్నారు. కానీ నిన్న అందరికీ షాక్ ఇస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇది కొందరికి ఆశ్చర్యం కలిగించిన, మరి కొందరు వారు జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ద్వారా పోస్టులు పెడుతున్నారు.. వీరిద్దరి జాతకం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.. దాంతో సమంత, నాగ చైతన్య మళ్లీ కలుస్తారా అనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

వేణుస్వామి జాతకం..

నాగ చైతన్య, శోభిత దూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా శోభితతో కూడా నాగచైతన్య ఎక్కువ రోజులు కలిసి ఉండరని 2027 వరకే వీరి బంధం బాగుంటుందని, ఆ తర్వాత వీరి బంధం బాగుండదని వీరిద్దరి మధ్య ఓ స్త్రీ వల్ల గొడవలు వస్తాయని ఆయన చెప్పాడు. నాగచైతన్యతో వైవాహిక బంధం శోభిత కంటే సమంతకే చాలా బాగుందని, చై సామ్ల బంధానికి 50 శాతం బాగుంటే, నాగచైతన్య శోభితల వైవాహిక బంధానికి కనీసం 10 శాతం కూడా లేదని అంత బాగుండే చై సామ్ లు నాలుగేళ్ళకే విడిపోయారు. వీరిద్దరూ కూడా మూడేళ్లకు విడిపోవడం ఖాయం అని తేల్చి చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

సమంత, నాగ చైతన్య మళ్లీ కలవబోతున్నారా?

జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పిన విధంగా చూసుకుంటే శోభితధూళిపాల కారణంగానే సమంత, నాగచైతన్య బంధం విడిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. అలాగే వీరి ఎంగేజ్మెంట్ తర్వాత కూడా అప్పుడు ఎలా అయితే జాతకం చెప్పానో ఇప్పుడు కూడా సేమ్ అలాగే నాగచైతన్యశోభిత బంధం ఓ స్త్రీ కారణంగా చెడిపోతుందని అన్నారు. స్త్రీ అంటే సామ్ అయి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మూడేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య కలవడం ఖాయమని వేణు స్వామి వీడియో కు కామెంట్స్ చేస్తున్నారు. వేణు స్వామి చెప్పినట్టే జరిగితే. 2027 లో మళ్లీ నాగ చైతన్య – సమంతలను భార్య భర్తలుగా చూడొచ్చా..? అని సామ్ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ వీరిద్దరు ఎప్పుడు కలుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు