FariaAbdullah : సినిమాల్లేకపోయినా ఘాటు అందాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ!

FariaAbdullah : టాలీవుడ్ లో జాతిరత్నాలు సినిమాతో పరిచయమైన బ్యూటీ “ఫరియా అబ్దుల్లా”. ఆ సినిమాలో చిట్టి పాత్రతో అలరించిన ఫరియా, మూవీ లవర్స్ మనస్సులో కూడా చిట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపొయింది. హైదరాబాద్ కి చెందిన ఈ తెలుయమ్మాయి, జాతిరత్నాలులో తన చిట్టి చిట్టి మాటలతో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. ఇక ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఫరియా, దాని తర్వాత వరుస ఆఫర్లు కూడా అందుకుంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా అంతగా హిట్ అవలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసింది అంతే. ఇక ఆ తర్వాత లైక్ షేర్ సబ్స్క్రయిబ్, రావణాసుర, రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో నటించింది కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ అవలేదు.

Faria Abdullah Latest hot photoshoot wiral on social media

సినిమాల్లేకపోయినా గ్లామర్ షో తో హీటెక్కిస్తోంది…

అయితే ఫరియా కి జాతిరత్నాలు తర్వాత మళ్ళీ ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. దాంతో మొన్నటివరకు ఆఫర్లు వచ్చినా సక్సెస్ లేకపోవడంతో, ఇప్పుడు పూర్తిగా తక్కువైపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రమె తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో రచ్చ చేస్తూనే ఉంది. బోల్డ్ ఫొటోస్ అయినా వెనకాడట్లేదు. ఇక లేటెస్ట్ గా లైట్ పింక్ కలర్ లో చేసిన ఫోటోషూట్ లో ఘాటు అందాలతో మత్తెక్కిస్తోంది. ఈ గ్లామర్ షో చూసైనా ఎవరైనా దర్శక నిర్మాత సినిమా ఆఫర్ ఇవ్వకపోతాడా అని చేస్తున్నట్టు ఉంది. ఇక ఫరియా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఈ సమస్య వల్లే చిట్టికి ఆఫర్లు కరువా?

అయితే ఫరియా కి పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో నెట్టింట పలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. సక్సెస్ లేకపోవడంతో ఆఫర్లు రావడం లేదని కొందరు అంటున్నారు. కానీ చిట్టికి ఉన్న హైట్ కారణంగానే పెద్దగా ఆఫర్లు రావడం లేదని అంటున్నారు కొందరు. ఫరియా ఆల్మోస్ట్ ఆరడుగులు ఉంటుందని టాక్. అందువల్లే కాస్త హైట్ తక్కువ ఉన్న హీరోల సరసన ఆఫర్లు రావడం లేదని అంటున్నారు నెటిజన్లు. ఇక ఫరియా ప్రస్తుతం వల్లి మయిల్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది. మరి తెలుగు లో మళ్ళీ ఏ సినిమాతో పలకరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు