Suriya: హీరోకి ప్రమాదం.. హుటాహుటిన హాస్పిటల్కి తరలింపు..!

Suriya.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఆయన తమిళంలో నటించే చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే తెలుగు ఆడియన్స్ కూడా ఈయనకు ఎక్కువగా ఫ్యాన్స్ గా మారిపోయారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సూర్య కు సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈయన తన 44వ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా ప్రమాదమైనట్లు సమాచారం .

Suriya: Hero's accident.. Emergency transfer to hospital..!
Suriya: Hero’s accident.. Emergency transfer to hospital..!

షూటింగ్ సెట్లో సూర్యకి ప్రమాదం..

సూర్య తాజాగా సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా ఈయనకు గాయం అయినట్లు, దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రమాదంపై స్పందించిన నిర్మాత.

అయితే ఈ విషయాలపై తాజాగా ఆ చిత్ర నిర్మాత రాజశేఖర్ పాండియన్ మీడియాతో చెప్పుకొచ్చారు. రాజశేఖర్ పాండియన్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్లో హీరో సూర్యకి స్వల్ప గాయం అయింది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కూడా చేసాము. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసి మొదట అభిమానులు ఆందోళన చెందినా, చిన్న గాయం అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో మారుతున్నారు.

- Advertisement -

హీరో సూర్య కెరియర్..

హీరో సూర్య విషయానికి వస్తే.. నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. 1997లో వచ్చిన నెరుక్కు నేర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈయన, ఆ తర్వాత 2001లో వచ్చిన సూర్య నంద అనే చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన థ్రిల్లర్ మూవీ కాఖా కాఖా చిత్రంతో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నారు సూర్య. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాలో నటించిన ఈయన ఈ సినిమాలో మూడోసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలు 16 సంవత్సరాలు యువకుడిగాను అలాగే 65 సంవత్సరాలు ముసలివాడిగా కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇకపోతే సింగం సిరీస్ లతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఆకాశమే నీ హద్దురా సినిమాతో మరో సంచలనం సృష్టించారు. జై భీమ్ సినిమాతో అవార్డులు కూడా అందుకున్నారు. హీరో గానే కాకుండా 2022లో వచ్చిన విక్రమ్ సినిమాలో అతిథి పాత్ర పోషించి రోలెక్స్ గా ఆకట్టుకున్నారు సూర్య.

అక్టోబర్ 10 న విడుదల కానున్న #సూర్య 44 మూవీ..

ఇక ప్రస్తుతం తన 44వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కంగ అనే ఒక పరాక్రముడి జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో సూర్య ఏకంగా 6 విభిన్నమైన లుక్స్ లో కనిపించనున్నట్లు సమాచారం. అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు