HarishShankar : చూసే మీకే అంతుంటే.. తీసే నాకెంతుండాలి.. నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లై..

HarishShankar : టాలీవుడ్ లో ఆగష్టు 15న రాబోతున్న సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి. ఆరోజు పెద్దా చిన్నా కలిపి అరడజను క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండగా, భారీ అంచనాలున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ఈ మిస్టర్ బచ్చన్ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే రిలీజ్ కి ఐదు రోజులే సమయం ఉండగా, చిత్ర యూనిట్ కూడా నాన్ స్టాప్ గా భారీగా ప్రమోషన్లు చేస్తూ, సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. ఇక టీజర్, సాంగ్స్ సహా, లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోగా, ఇప్పటికీ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ తనదైన శైలిలో సినిమాని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా హరీష్ శంకర్ ఓ విషయంలో నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.

HarishShankar Strong Reply to Netizen

చూసే నీకే అంతుంటే.. తీసే నాకెంతుండాలి – హరీష్

హరీష్ శంకర్ తాజాగా ఓ నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అసలు విషయమేంటంటే.. హరీష్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తాడన్న విషయం తెలిసిందే. తాను తీసిన గబ్బర్ సింగ్, గద్దల కొండగణేష్ లాంటి సినిమాలు మంచి సక్సెస్ లు సాధించగా, అందుకే రీమేక్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడని అని టాక్. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా బాలీవుడ్ రైడ్ కి రీమేక్ అని తెలిసిందే. ఈ క్రమంలో ఓ నెటిజన్ హరీష్ ని ప్రశ్నిస్తూ… ఇలా అన్నాడు.. అసలు నువ్వు ఏం అనుకుంటున్నావ్ అన్నా.. రీమేక్ ఎందుకు వద్దు అంటున్నామో.. చెప్పడానికి చాలా కారణాలున్నాయ్.. కానీ రీమేక్ ఎందుకు చేయాలనుకుంటున్నావో ఒక్క రీజన్ చెప్పు అన్నా.., రీమేక్ అయితే కేవలం మన ఫ్యాన్స్ చూస్తారన్నా.. మరి న్యూట్రల్ ఆడియెన్స్ పరిస్థితి ఏంటి?.. దయచేసి మార్చేసేయ్ అన్నా.. అంటూ ఓ నెటిజన్ రిక్వెస్ట్ చేశాడు.

- Advertisement -

అయితే నెటిజన్ అన్న దానికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ…”చూసే నీకే అంత కాన్సర్న్ ఉంటే.. తీసే నాకెంత ఉండాలి? అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. అంటే ఒక రీమేక్ సినిమా చేసేటపుడు తాను ఎంత అలోచించి ఉంటాడో, ఎన్ని మార్పులు చేసి ఉంటాడో, ఎంత డెడికేటెడ్ గా సినిమా తీసి ఉంటాడో అన్న ఉద్దేశంతో ఈ రిప్లై ఇచ్చాడని అంటున్నారు నెటిజన్లు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా మరో ఐదు రోజుల్లో ఆగష్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుండగా, తెలుగులో భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో, ఈ సినిమాపై ఫోకస్ కోసం హరీష్ ఎంతో ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా సక్సెస్ పై ఎంతో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు