Indra: మురారి సినిమాలో పెళ్లి చేసుకున్నారు ఒకే, ఇంద్ర సినిమాకి మర్డర్లు చెయ్యరు కదా

Indra: రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఒకప్పుడు థియేటర్లో మిస్ అయిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు థియేటర్లో చూసే అవకాశం కలుగుతుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ సినిమాల పండగ ప్రతి హీరో పుట్టినరోజుకి స్పెషల్ అకేషన్స్ కి జరుగుతూనే ఉంటుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అప్పట్లో ఒక్కడు పోకిరి సినిమాలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు జల్సా సినిమాలను రిలీజ్ చేశారు.

ఇక రీసెంట్ గా మురారి సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నప్పుడు చాలామంది వీటి కంటే కూడా బెటర్ సినిమాలు ఉన్నాయి కదా అవి చేస్తే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు మురారి సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి పెళ్లి కార్డులు పోస్టింగ్. థియేటర్ దగ్గర మండపాలు సెట్టింగు వేయడం మొదలుపెట్టారు. మామూలుగా రీ రిలీజ్ సినిమాలు ఎలా ఎంజాయ్ చేస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఏకంగా రెండు మూడు జంటలు థియేటర్లో పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరి. మురారి సినిమా కాబట్టి పెళ్లిళ్లు చేసుకున్నారు ఓకే, ఒకవేళ ఇంద్ర సినిమా వస్తే థియేటర్లో మర్డర్స్ చేస్తారంటూ సెటైర్లు కూడా మొదలుపెట్టారు.

Murari

- Advertisement -

మామూలుగా రీ రిలీజ్ షో అంటేనే విపరీతంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. డాన్సులు వేయడం అలానే సేమ్ కాస్ట్యూమ్స్ వేసుకొని థియేటర్ కు వెళ్లడం. కాగితాలు విసరడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పెళ్లి జరగడం అనేది అరుదైన విషయం అని చెప్పాలి. ఇక మురారి సినిమా విషయానికి వస్తే కృష్ణవంశీ కెరియర్ లో ఒక బెస్ట్ ఫిలిమ్ ఇది. మహేష్ బాబుకి అద్భుతమైన పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు