Naga Chaitanya: ఎంగేజ్మెంట్ చేసుకుని , ఇంకో అభిమాని పెళ్ళికి హాజరు అయ్యాడు

Naga Chaitanya: జోష్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. అయితే ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య పర్ఫామెన్స్ కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇకపోతే నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేలు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.

నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఎంతగానో ప్రేమించిన సమంతాను పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు కాపురం చేసి వాళ్లకున్న వ్యక్తిగత కారణాల వలన విడిపోయారు. ఇద్దరూ తమకు తాముగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రీసెంట్ గా నాగచైతన్య మరో ఇంటికి అల్లుడు కాబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం తెలిసింది. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే అవన్నీ కేవలం కథనాలు అనుకున్నారు వాస్తవానికి వీరిద్దరూ ముందుగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

Naga Chaitanya

- Advertisement -

ఇకపోతే నాగచైతన్య ఎంగేజ్మెంట్ అవ్వగానే తన దగ్గర పని చేసే అసిస్టెంట్ కుటుంబంలో ఒకరు పెళ్లి రాజమండ్రిలో జరిగింది. ఆ పెళ్ళికి నాగచైతన్య కూడా హాజరయ్యాడు. తన ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ఆ పెళ్లికి వెళ్లడం అనేది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మామూలుగా సామాన్యుల ఇంటికి సెలబ్రిటీలు రావడానికి అంతగా ఇష్టపడరు. అలాంటిది తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రత్యేకమైన సమయాన్ని కూడా తమ అసిస్టెంట్ కోసం కేటాయించడం అనేది చాలామందికి బాగా అనిపిస్తున్న విషయం. ఇక చెయ్ నటిస్తున్న తండేల్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు