Nani : బుల్లి తెరపై మరోసారి సందడి చెయ్యబోతున్న నాని..

Nani : న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడంతో ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు.. ఆ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ మూవీకి ప్రమోషన్స్ ను కూడా పెంచినట్లు తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ కోసం నాని బుల్లి తెరపై సందడి చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లి తెర పై ప్రసారం అవుతున్న ఒక షోలో నాని సందడి చెయ్యబోతున్నాడు. ఆ షోకు సంబందించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

నాని సరిపోదా శనివారం మూవీ ఆగస్ట్ 29న రాబోతోంది. ఈ క్రమంలో నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద సందడి చేయబోతోన్నారు. ఈ మేరకు షోకి వచ్చాడు. ఆల్రెడీ ఎపిసోడ్స్ షూట్ చేశారు. ఈ ఎపిసోడ్స్‌లో నాని కనిపించబోతున్నారు. దసరా సందర్భంగా నాని గత రెండో సీజన్‌లోనూ నాని సందడి చేశారు. ఆ షో భారీ హిట్ టాక్ ను అందుకుంది. ఆ షో లో నాని వచ్చినప్పుడు క్రేజ్ ఎక్కువగా అందుకుంది. అందుకే ఈ సీజన్ లో కూడా నాని గెస్టుగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో బిజీగా చెయ్యనున్నాడు.

Nani is going to make noise on Bulli screen once again..
Nani is going to make noise on Bulli screen once again..

ఈ సినిమాలో నాని సరికొత్తగా కనిపిస్తున్నాడు. సినిమా స్టోరీ లైన్‌ను ఎస్ జే సూర్య లీక్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నతనంలోనే ఎక్కువ ఆవేశంతో ఉండే కుర్రాడిని కంట్రోల్ చేసేందుకు అమ్మ ఇచ్చిన సలహాతోనే ఈ కథ ఉంటుందని అతను చెప్పాడు.. అమ్మ సెంటిమెంట్ తో సినిమా కథ ఉండబోతుందని హింట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా మాస్, యాక్షన్ తో పాటుగా సెంటిమెంట్ సినిమాగా రాబోతుందని తెలుస్తుంది. శనివారం అనే పేరు పైనే కాన్సెఫ్ట్ ఉంటుందని సమాచారం.. ఇకపోతే ఈ మూవీలో నాని పాత్రతో పాటు ఎస్ జే సూర్యకు క్యారెక్టర్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వదిలిన గ్లింప్స్ , పోస్టర్‌లు చూస్తుంటే సరిపోదా శనివారం మాత్రం కాస్త కొత్తగా ఉంటుందని ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ను చూస్తే తెలుస్తుంది.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు