12Years For Andala Rakshasi: అందమైన అద్భుతానికి 12 ఏళ్లు

12Years For Andala Rakshasi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వచ్చిన కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కువగా చాలామంది దర్శకులు లవ్ స్టోరీస్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అదే ఇప్పటివరకు లవ్ స్టోరీలను ఈ దర్శకుడు డీల్ చేస్తాడు అంటూ ఎవరూ సరైన పేరుని సాధించుకోలేకపోయారు. అని ప్రస్తుతం ఉన్న జనరేషన్లో హను రాఘవపూడి లవ్ స్టోరీస్ ను అద్భుతంగా తీస్తాడు అని పేరును సాధించాడు. ఇప్పటివరకు హను తీసిన సినిమాలలో లవ్ స్టోరీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. ఈ సినిమా వారాహి బ్యానర్ పై నిర్మితమైంది.

అందాల రాక్షసి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించి నేటికి 12 ఏళ్లు అయింది. ఈ సినిమాతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను క్రియేట్ చేశాడు దర్శకుడు. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన లవ్ స్టోరీస్ అన్నిటికంటే కూడా ఇదొక ఫ్రెష్ ఫీల్ ని క్రియేట్ చేసింది. వాస్తవానికి ఈ దర్శకుడు మణిరత్నం ఇన్ఫరెన్స్ తో ఇండస్ట్రీకి వచ్చాడు అని అందరికీ అప్పుడే అర్థమైపోయింది. ఈ సినిమా క్యారెక్టర్స్ లాంగ్వేజెస్ కూడా అలానే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమా చాలా పొయిటిక్ వేలో ఉంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.

Andala Rakshasi

- Advertisement -

మామూలుగా ఈ సినిమాను మణిరత్నం తీసే సినిమాలతో కంపేర్ చేస్తూ చాలామంది మాట్లాడారు. వాస్తవానికి ఈ క్యారెక్టర్ ను తను మిస్సమ్మ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హను. ఏదైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప దర్శకుడుని అందించింది అని చెప్పాలి. ఇక రీసెంట్ గా హను తీసిన సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత చాలామంది మాకు ఉన్నాడు మణిరత్నం అంటూ ఎలివేషన్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు