Harish Shankar: నల్లంచు తెల్లచీర, కమర్షియల్ సినిమాకి పూర్వవైభవం తీసుకొస్తున్నాడు

Harish Shankar: రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమా డెఫినిషన్ మారిపోయింది. తెలుగు సినిమా అనడం కంటే కూడా భారతీయ సినిమా అని చెప్పడం ఈమధ్య మొదలైంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కొన్ని తెలుగు సినిమాలు కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ పక్కా మాస్ కమర్షియల్ తెలుగు సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఆడియన్స్ సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎంటర్టైన్ అవ్వడం కోసమే థియేటర్ కూడా ఎంట్రీ ఇస్తారు. అయితే వాళ్లందరూ ఇప్పుడు ఒక ప్రాపర్ కమర్షియల్ తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా మిక్కీ జే మేయర్ అందించిన పాటలు వేరే లెవెల్ అని చెప్పాలి. సితార్, రెప్పల్ డప్పుల్, జిక్కి ఈ మూడు పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రోజుల పోతే గణేష్ మండపాల్లో కూడా రెప్పలు డప్పుల్ రెగ్యులర్ గా వినిపిస్తుందని చెప్పాలి. మిక్కిలాంటి సాఫ్ట్ మ్యూజిక్ దర్శకుడు తో అంత ఫాస్ట్ బీట్ సాంగ్ ను హరీష్ ఎలా చేయించాడు అని అందరికీ కొద్దిపాటి ఆశ్చర్యం కూడా ఉంది. బహుశా మిక్కీ టాలెంట్ హరీష్ కి తెలియటం వలన ఏమో మిక్కిని ఆల్ రౌండర్ అంటూ ఉంటాడు.

Ravi Teja sends romantic vibes as Mr. Bachchan - Telugu News - IndiaGlitz.com

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా నుంచి 4వ పాటను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది చిత్ర యూనిట్. ఈ పాట పేరు “నల్లంచు తెల్లచీర” ఈ రెండు పదాలు వినగానే క్యూరియాసిటీ చాలామందికి విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ రాముడు సినిమాలోని ఈ పాట ఎంత పెద్దగా ఫేమస్ ఏందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే పేరుతో పాట రావడం, లేదా అదే పాటను రీమేక్ చేస్తున్నారు తెలియదు గానీ ఈ పాటపై మాత్రం మంచి ఆసక్తి ఉంది. ఒకప్పుడు పాటలన్నీ రిలీజ్ అయిన తర్వాత అవన్నీ మైండ్ లో రిజిస్టర్ అయిన తర్వాత సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు ప్రతి పాటను విజువల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ ఫీల్ అనేది రీసెంట్ టైమ్స్ లో పోయింది. మళ్లీ అలాంటి ఫీల్ ను హరీష్ శంకర్ తీసుకొస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆసక్తిని రేపుతుంది. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు