OTT Movie : ప్రేమ పేరుతో అమ్మాయిల గొంతు కోసే సైకో… వణికించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : ప్రేమ పేరిట జరిగే నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు. ప్రతిరోజు మన రియల్ లైఫ్ తో పాటు సినిమాల్లో కూడా ఇలాంటి స్టోరీలను చూస్తూనే ఉన్నాము. ఇక ఈ లవ్ అనే కాన్సెప్ట్ కి సైకో కిల్లర్ ను యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? సమాధానం తెలియాలంటే ఈరోజు మన మూవీ సజెషన్ గురించి తెలుసుకోవాల్సిందే. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? స్టోరీ ఏంటి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ సీన్ సీనుకో షాక్ ఇస్తుంది. పైగా ప్రేమ అనే మాట వినిపిస్తేనే వణికించేలా చేస్తుంది. ఈ సినిమాలో గగుర్పాటు కలిగించే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు గ్రిప్పింగ్ స్టోరీ నరేషన్ కూడా ఉంటుంది. పైగా థ్రిల్లర్ హారర్ సినిమాలను రెగ్యులర్ గా చూసే వారు కూడా ఈ సినిమాను చూస్తే కాస్త భయపడక మానరు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ముందుగా ఒక అందమైన లవ్ స్టోరీ గా మొదలై భయపెట్టే ట్విస్ట్ తిరుగుతుంది.

New Review: Berlin Syndrome (2017) - HubPages

- Advertisement -

కథ ఏంటంటే…

ఈ సినిమాలో ఒక హీరోయిన్ రోడ్డు దాటుతుండగా సడన్గా చేతులున్న వస్తువులు జారీ కింద పడతాయి. అయితే మరో వ్యక్తి వచ్చి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా మాటలు కలుపుతాడు. అయితే హీరోయిన్ నిజానికి ఒక లేడీ జర్నలిస్ట్. ఆమె హాలిడే కోసమే బెర్లిన్ వచ్చినట్టుగా అతనికి చెప్తుంది. బెర్లిన్ ను ఎక్స్ప్లోర్ చేస్తూ అక్కడ తనకు నచ్చిన పక్షులు కొత్త కొత్త ప్రదేశాలలో ఫోటోలు తీస్తూ స్వీట్ మెమరీస్ గా మలుచుకుంటుంది. ఇక ఈ వ్యక్తి పొరపాటున పరిచయం అవుతాడు కానీ కాసేపటికే ఆమెను మాటల్లో పెట్టేసి రొమాన్స్ కూడా స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అతని ఫ్లాట్ కెళ్ళి నైట్ అక్కడే గడుపుతారు. అయితే ఈ జర్నలిస్ట్ ఉదయాన్నే నిద్ర లేచే సరికి అతను ఇంట్లో కనిపించడు. అయితే కొత్త ఇల్లు కావడంతో హీరోయిన్ అలా తిరుగుతూ రూమ్ అంతా చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఒక ఆల్బమ్ కనిపిస్తుంది. కానీ అందులో అతనితో పాటు మరికొందరు అమ్మాయిల ఫోటోలు ఉండడం ఆమెను షాక్ కు గురి చేస్తుంది. అసలే జర్నలిస్ట్ కావడంతో వెంటనే అలర్ట్ అవుతుంది. పైగా అతని మీద అనుమానం కూడా మొదలవుతుంది. ఇదే మంచి టైం ఇంట్లో నుంచి బయటపడడానికి అని అనుకుంటుంది. కానీ తీరా బయటకు వెళ్లడానికి ట్రై చేస్తే ఇల్లంతా లాక్ చేసి ఉంటుంది. మొత్తానికి అలా హీరోయిన్ ట్రాప్ అవుతుంది. మరి ఇంతకీ ఈ సైకో కిల్లర్ ఇలా అమ్మాయిలను ఎందుకు వరుసగా హత్యలు చేస్తున్నాడు? హీరోయిన్ బయట పడగలిగిందా లేదా? అనే సంగతులు తెలియాలంటే ఈ వీకెండ్ బెర్లిన్ సిండ్రోమ్ అని సినిమా చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు