OTT Movie : ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ చేసే మలయాళ మర్డర్ మిస్టరీ… ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ప్రతి వారం ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు ఇలా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త కంటెంట్ గురించి వారం ముందు నుంచే అప్డేట్స్ అందుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తాయి. అలా ఈ వారం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మర్డర్ మిస్టరీ గురించి ఈరోజు మన మూవీ సజెషన్. ఈ వీకెండ్ మస్ట్ వాచ్ లిస్టులో ఉండే ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ సినిమా పేరేంటి? అనే విషయాలను చూసేద్దాం.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు ఎంతగా క్రేజ్ పెరిగింది అంటే ఓటిటిలో వచ్చే ఈ సినిమాలను వదలకుండా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు గోలం. ఈ మర్డర్ మిస్టరీ మూవీ మలయాళీ సినిమాలను బాగా ఇష్టపడే వారికి ప్రత్యేకంగా నచ్చుతుంది. ఎందుకంటే మలయాళ మేకర్స్ ఒక డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతూ సినిమాను తెరకెక్కిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటూ సినిమా చూస్తున్నంత సేపు మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ను ఇస్తాయి.

గోలం మూవీ పోస్టర్ (ఫోటో:Instagram/@golammovieofficial)

- Advertisement -

అదొక్కటే కష్టం

ఈ గోలం సినిమా పూర్తిగా కొత్త వాళ్ళతో రూపొందింది. నటీనటుల దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్టర్ కూడా కొత్తవాడే. ప్రవీణ్ విశ్వనాథ్‌తో కలిసి స్క్రిప్ట్‌ను రచించిన దర్శకుడు సంజద్ పిఎస్, మొదటి నుండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా బలమైన కథనాన్ని అందించాడు. ఈ చిత్రంలో రంజిత్ సజీవ్ కథానాయకుడిగా నటించారు. అందరూ కొత్తే అయినప్పటికీ కంటెంట్ బాగుండడంతో మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుగులో కూడా డబ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే సినిమాను సబ్ టైటిల్స్ తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

స్టోరీ ఏంటంటే..

గోలం అనేది ఒక కార్పోరేట్ సంస్థ కార్యాలయంలో జరిగిన హత్యపై ASP సందీప్ కృష్ణ (రంజిత్ సజీవ్) చేసే దర్యాప్తు ఆధారంగా నడిచే మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. పోలీసు అధికారికి అకారణంగా సంబంధం లేని కొన్ని ఆధారాలు దొరుకుతాయి. అతను తన దర్యాప్తు సమయంలో ఒక పజిల్ లాగా వాటిని కలపడం ప్రారంభిస్తాడు. మరి ఆ తరువాత నిందితుడిని పట్టుకోగలిగాడా? చివరికి ఏం జరిగింది? అనేది స్టోరీ. మాలీవుడ్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు