Puri Jagannadh : టైం వచ్చేసింది… సమాధానాలు కూడా రావాలి

Puri Jagannadh :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బద్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సరైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. సంవత్సరాలు కొద్ది లేట్ చేయకుండా త్వర త్వరగా షూటింగ్ పూర్తి చేయటం బ్లాక్ బస్టర్ కొట్టడం పూరి స్టైల్. పూరి జగన్నాథ్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. దాదాపు స్టార్ హీరోలు అందరితో కూడా పూరి జగన్నాథ్ వర్క్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో పూరి కూడా తన స్టైల్ మార్చారు చాలా లేటుగా సినిమాలు చేస్తున్నారు.

పూరి జగన్నాథ్ కెరియర్ లో పాన్ ఇండియా సినిమాగా వచ్చింది లైగర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా మీద అందరికీ చాలా మంచి అంచనాలు ఉండేవి. దాదాపు 200 కోట్లు పైకి ఈ సినిమా వసూలు చేస్తుందని చాలామంది ఊహించారు. అనూహ్యంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా తీవ్ర నష్టాలను చూసింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన రిలీజ్ త్వరలో జరగనుంది. ఈవెంట్లో పూరి జగన్నాథ్ లైగర్ ఇష్యూపైన స్పందించాలి. దీనివలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు ఎగ్జిబిటర్స్ కు పూరి జగన్నాథ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.

Puri Jagannadh

- Advertisement -

 

ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ శంకర్ జరుగుతున్న టైంలో పూరి జగన్నాథ్ కి రామ్ కి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. సినిమా రిలీజ్ తర్వాత పూరి జగన్నాథ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి రామ్ గురించి చెప్తాడు అని కథనాలు కూడా వచ్చాయి. దీనిపై కూడా పూరి జగన్నాథ్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతానికి అక్కడక్కడ ప్రమోషన్స్ లో పూరి కంటే రామ్ మాత్రమే కనిపిస్తున్నాడు. రామ్ కూడా హిట్ సినిమా చేసి చాలా ఏళ్లయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకుంటాడేమో వేచి చూడాలి.

ప్రస్తుతం ఉన్న సమస్యలతో పాటు పూరికి పట్టుకుని మరో సమస్య మై హోమ్ సంస్థకి పూరి 40 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందని వార్తలు వచ్చాయి. అవి క్లియర్ చేయండి సందర్భంలో సినిమా రిలీజ్ ను కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మరి ఆపుతారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది మరి ఈ సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారా లేదంటే నార్మల్గా రిలీజ్ చేస్తారా.? పెడితే మాత్రం కచ్చితంగా పూరి వీటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు