Kolamaavu Kokila: అలియా భట్ చేయాల్సిన సినిమాను జాన్వి కపూర్ లాక్కుంది

Kolamaavu Kokila: కోలమావు కోకిల సినిమాతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. నయనతార నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే చాలా ఏళ్ల క్రితం సింబు హీరోగా ఒక సినిమాను మొదలుపెట్టాడు నెల్సన్. ఆ సినిమా షూటింగ్ కూడా సగం వరకు పూర్తయింది. కానీ మధ్యలో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఆరేళ్లు తర్వాత నయనతార హీరోయిన్గా కోలమావు కోకిల సినిమాను చేశాడు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది ఇక్కడ కూడా మంచి ఆదరణ ఈ సినిమాకు లభించింది.

ఈ సినిమా తర్వాత వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాలు చేశాడు నెల్సన్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రజనీకాంత్ జైలర్ అనే సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు నెల్సన్ జైలర్ 2 చేసే పనిలో పడ్డాడు. ఇకపోతే కొలమావు కోకిల సినిమాను హిందీలో అలియాభట్ హీరోయిన్ గా తను డైరెక్షన్ చేయాలని నెల్సన్ అనుకున్నాడు. కానీ ఈలోపే ఆ సినిమాను జాన్వి కపూర్ చేసేసింది. అయితే హిందీలో కూడా ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది.

Kolamavu Kokila

- Advertisement -

ఇకపోతే కోలమావు కోకిల లాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం తనకు ఎప్పటినుంచో చేయాలని ఉంది అంటూ చెప్పాడు నెల్సన్. ఇక ప్రస్తుతం నెల్సన్ చేస్తున్న జైలర్ 2 సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. నిజమైన కోలీవుడ్ లో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ సూపర్ స్టార్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. జైలర్ టు సినిమాను పూర్తి చేసిన తర్వాత తెలుగులో అల్లు అర్జున్ తో నెల్సన్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ దీని గురించి ఇప్పటివరకు అధికార ప్రకటన రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు