PhirAayi Haseena Dilruba : తాప్సి క్రేజీ సినిమా సీక్వెల్..ఓటిటి రెస్పాన్స్ ఎలా ఉందంటే?

PhirAayi Haseena Dilruba : బాలీవుడ్ హీరోయిన్ తాప్సి పన్ను వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయిన ఈ ఢిల్లీ డాల్, అక్కడ ఒక పక్క సినిమాలు చేస్తూనే, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా తాప్సి నటించిన ఓ క్రేజీ సినిమాకి సీక్వెల్ ఓటిటి లో రిలీజ్ అయింది. మూడేళ్ళ కింద తాప్సి, విక్రాంత్ మస్సే లీడ్ రోల్స్ లో నటించిన ‘హసీనా దిల్ రుబా’ 2021 లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ముందుగా ఆ సినిమా కి యావరేజ్ రెస్పాన్స్ లభించినా, తర్వాత ఓ రేంజ్ లో రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ మూవీ సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు దానికి సీక్వెల్ గా “ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా” పేరుతో సీక్వెల్ తెరకెక్కగా, ఆగష్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది.

PhirAayi HaseenaDilruba movie got mixed reviews

ఓటిటి రెస్పాన్స్ ఎలా ఉందంటే..

ఇక రెండు రోజుల కింద నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ‘ఫిర్ ఆయి హసీనా దిల్ రుబా లేటెస్ట్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఓటిటి లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మొదటి భాగంలో నటించిన తాప్సి, విక్రాంత్ పాత్రల చుట్టే సీక్వెల్ కథ కూడా నడుస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో మర్డర్ చేసి తప్పించుకోగా, ఈ సీక్వెల్ లో ఆ మర్డర్ కేసు చుట్టే, అంటే.. ఫ్లాష్ బ్యాక్ నెరేషన్స్ లోనే కథ నడుస్తుంది. ఫస్ట్ పార్ట్ మీద ఉన్న హైప్ కారణంగా ఈ సీక్వెల్ పై కూడా మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ థ్రిల్లర్, అలాగే సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. కానీ ప్రేక్షకులకు అంత తొందరగా కనెక్ట్ కాదని సమాచారం.

- Advertisement -

కేసు మళ్ళీ రీ ఓపెన్..

ఇక ఈ సీక్వెల్ సినిమా కథలోకి వెళ్తే రాణి, రిషబ్ మర్డర్ చేసాక వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వారి ఐడెంటిటీ కూడా మార్చుకొని హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. టైం చూసి వేరొక దేశం వెళ్లిపోవాలని అనుకుంటుండగా, మర్డర్ అయిన నీల్ మేనమామ ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో, కేసుని రీ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత కథ ఇంటరెస్టింగ్ కోణంలోకి వెళ్తుంది. ఊహించని ట్విస్ట్ లతో సాగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత థ్రిల్ ఈ సినిమాలో లేదని, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకోవడంతో బోర్ ఫీల్ వస్తుందని అంటున్నారు. అయితే ఓటిటి లో వచ్చింది కాబట్టి, ఓసారి చూసేలానే ఉందని, కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదని అంటున్నారు నెటిజన్లు. తాప్సి మాత్రం తన పెర్ఫార్మెన్స్ తో మరోసారి మెప్పించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు