RamCharan : గ్లోబల్ స్టార్ చేతిలోనే ఇండియన్3 భవిష్యత్తు..!

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ దాదాపు ముగిసిపోయిందని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. బహుశా చరణ్ లేని ఓ పది రోజుల సీన్లు ఉంటాయని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కి తీసుకువస్తున్నామని దిల్ రాజు ఆ మధ్య రివీల్ చేయడం జరిగింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఇప్పుడు రామ్ చరణ్ తో కంటే శంకర్ కే ఎక్కువ కీలకం కానుంది. ఎందుకంటే కెరీర్ లో ఎప్పుడూ లేనట్టు తొలిసారి ఇండియన్2 తో డిజాస్టర్ ని అందుకున్న శంకర్, ట్రోలర్ల బారిన కూడా పడ్డాడు. ఓటిటి లో ఇండియన్2 రిలీజ్ అయ్యాక మరింతగా శంకర్ పై విమర్శలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో శంకర్ ని ఆదుకునేది రామ్ చరణ్ అనే చెప్పాలి.

The release of Indian 3 depends on the result of RamCharan's game changer

ఇండియన్ 3 భవిష్యత్ చరణ్ చేతిలోనే?

ఇక శంకర్ కి ఇప్పుడు తనని తాను నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే ఇండియన్ 3 కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ (RamCharan) పైనే భారం పడిందని చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” కోసం మెగాభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కి బిగ్గెస్ట్ బలం రామ్ చరణ్ అనే చెప్పాలి. ఆల్రెడీ గత పదేళ్లుగా సరైన ఫామ్ లో లేని శంకర్ కి రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో సక్సెస్ రుచి చూపిస్తే.. మళ్ళీ శంకర్ ఫామ్ లోక్ వచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఇండియన్ 3 బిజినెస్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ 3 సినిమా కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో గేమ్ ఛేంజర్ ఫలితం తోనే దాని బిజినెస్ ముడి పడి ఉందని తెలుస్తుంది.

- Advertisement -

క్రిస్మస్ కి జాక్ పాట్ కొడతాడా?

ఇక గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ రామ్ చరణ్ తో పాటు, శంకర్ కి కూడా కీలకం కాగా, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కి కూడా కీలకమే అని చెప్పాలి. కెరీర్ లో అతిపెద్ద సినిమా నిర్మిస్తున్న దిల్ రాజు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఇండియన్ 3 కి డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి రావాలన్నా గేమ్ ఛేంజర్ పైనే ఆధారపడి ఉందని చెప్పాలి. దీంతో అసలైన గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ అయ్యాడు ఇప్పుడు. పాన్ ఇండియా వైడ్ గా చరణ్ మేనియా తోనే గేమ్ ఛేంజర్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఇక గేమ్ ఛేంజర్ నుండి నెక్స్ట్ అప్డేట్ చిరు బర్త్ డే కి వచ్చే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు