OTT Movie : చెమటలు పట్టించే సైకలాజికల్ థ్రిల్లర్… ఏ ఓటిటిలో ఉందంటే?

OTT Movie : థ్రిల్లర్ సినిమాలు అంటేనే ఓ రకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ యాక్షన్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకాలజికల్ థ్రిల్లర్ అంటూ రకరకాల జానర్లకు సంబంధించిన సినిమాలు ఓటిటిలో అందుబాటులో ఉన్నాయి. అయితే తరచుగా యాక్షన్, సస్పెన్స్ సినిమాలు చూస్తూనే ఉంటారు మూవీ లవర్స్. కానీ సైకలాజికల్ థ్రిల్లర్ అని కేటగిరీలో వచ్చే సినిమాలు చాలా తక్కువ. అయితే అందులోను సినిమా చూసి చాలా రోజులైనప్పటికీ మైండ్ లో నుంచి పోని సినిమాలు కొన్ని ఉంటాయి. ఈ రోజు అలా పిచ్చెక్కించే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ని మీకోసం తీసుకొచ్చాం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ సీను సీనుకో ట్విస్ట్ తో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా ఉంటుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే అంత తేలిగ్గా మర్చిపోనివ్వదు. హిప్నాటిజం ఉపయోగించి ఓ మనిషిని కీలు బొమ్మలా ఎలా ఆడిస్తారు అనే విషయాన్ని ఈ మూవీలో స్పష్టంగా చూపించారు.

Get Out (2017) - Plot - IMDb

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

ఒక తెల్ల జాతి అమ్మాయి నల్ల జాతి కుర్రాడిని ప్రేమిస్తుంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లి కోసం పెద్దల అంగీకారం ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. అందులో భాగంగానే హీరోయిన్ పేరెంట్స్ ను కలిసి మాట్లాడడానికి వెళ్తారు. అయితే హీరోయిన్ ఒక నల్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను అంటే మా ఫ్యామిలీ తప్పకుండా షాక్ అవుతుంది అంటూ సరదాగా డైలాగ్ వదులుతుంది. ఆ తర్వాత హీరో తన తండ్రికి చెప్పి హీరోయిన్ పేరెంట్స్ ఇంటికి ఆమెతో బయలు దేరుతాడు. హీరో తండ్రి పోలీస్.  కారు ప్రయాణం మధ్యలో ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో అక్కడికి పోలీసులు వచ్చి ఇంటారాగేట్ చేసి వాళ్లను వదిలేస్తారు. తీరా హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆమె తల్లిదండ్రులు అస్సలు షాక్ అవ్వకుండా అతనితో ప్రేమగా మాట్లాడుతారు. అక్కడే సినిమా అసలు ట్విస్ట్ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్లంతా నల్లజాతీయులే. అసలు అక్కడున్న వారికి నల్ల జాతీయులు అంటే నచ్చదు. పైగా అక్కడ చాలామంది నల్లజాతీయులు అదృశ్యం అవుతూ ఉండడంతో మిస్సింగ్ కేసుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ హీరో తండ్రి గమనిస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ తండ్రి హీరోకి తెలియకుండానే అతనిపై ల్యాబ్ లో ఎలకలా ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతారు. పైగా ఒక కమ్యూనిటీని కూర్చోబెట్టి హీరో ఫోటోని చూపించి ఏం చేయాలో మాట్లాడుకుంటారు. ఇంతకీ హీరోయిన్ నేటివ్ ప్లేస్ లో నల్లజాతీయులు అంటే ఎందుకు నచ్చదు? అసలు హీరోని ఎందుకు హిప్నోటైజ్ చేసి హింసించారు? మరి అతను అక్కడి నుంచి తప్పించుకోగలిగాడా ?అనే విషయం తెలియాలంటే గెట్ అవుట్ మూవీని చూడాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు