OTT Movie : వెబ్సైట్ లో పాయల్ అసభ్యకర ఫోటోలు, వీడియోలు… ఓటిటిలో దూసుకెళ్తున్న మూవీ

OTT Movie : హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ముఖ్యంగా ఆమె నటించే బో*ల్డ్ సినిమాలు యూత్ ను పిచ్చెక్కిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఎక్స్ 100 మూవీ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ కొత్త సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా బోల్డ్ కంటెంట్ తో పాటు యాక్షన్ తో అదరగొట్టింది పాయల్ రాజ్ పుత్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఆహాలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో ఓటీటీలో దూసుకెళ్తోంది. ఆ మూవీ ఇంకేదో కాదు ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో తెరకెక్కిన రక్షణ. పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి జరిగిన కాంట్రవర్సీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన రక్షణ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో రోజుల వ్యవధిలోని థియేటర్లో నుంచి బయటపడి ఓటీటీలోకి వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచి పాపులర్ తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలో రక్షణ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలోకి వచ్చిన పది రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 60 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసి రికార్డును క్రియేట్ చేసింది. థియేటర్లలో మేకర్స్ ను నిరాశపరచినప్పటికీ ఓటీటీలో మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. మంచి సస్పెన్స్ డ్రామా కోసం చూసేవారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు.

Rakshana in OTT: సెన్సేషనల్ బ్యూటీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. | Payal Rajput Starring Rakshana Movie In Aha OTT KBK

- Advertisement -

కథ ఏంటంటే…

పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆమె ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే హీరోయిన్ ఫ్రెండ్ ప్రియా అనే అమ్మాయి చనిపోతుంది. అయితే ఆమెది ఆత్మహత్య కాదు హత్య అనే విషయం పాయల్ కి తెలుస్తుంది. కానీ ఆధారాలు లేకపోవడంతో చేసేదేమీ లేక సైలెంట్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన పాయల్ కు షాక్ ఇచ్చేలా ఓ ఇబ్బందికర సంఘటన ఎదురవుతుంది. అరుణ్ అనే వ్యక్తి పాయల్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అసభ్యకరమైన రీతిలో ఓ వెబ్సైట్లో పోస్ట్ చేస్తాడు. ఓ ఫ్రాడ్ కాల్ కారణంగా ఈ విషయం తెలుసుకున్న పాయల్ అతనిపై లీగల్ గా యాక్షన్ తీసుకుందాం అనుకుంటుంది. కానీ అంతలోనే అతను కూడా ఆత్మహత్య చేసుకుని దానికి కారణం పాయల్ అంటూ ఇంకో షాక్ ఇస్తాడు. కానీ నిజానికి అరుణ్ అనే వ్యక్తిది కూడా హత్య కాదు ఆత్మహత్య అనే విషయం హీరోయిన్ కి అర్థమవుతుంది. అసలు ఆ హత్యలు చేస్తున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోయిన్ ని టార్గెట్ చేస్తున్నారు? పోలీస్ ఆఫీసర్ గా ఉన్న హీరోయిన్ ఈ కేసును సాల్వ్ చేయగలిగిందా? అనే విషయాలు తెలియాలంటే రక్షణ మూవీ ని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు