OTT Movie : వాళ్ళతో పడు*కుంటే డబ్బులు… ఇదెక్కడి బో*ల్డ్ మూవీరా మావా

OTT Movie : థ్రిల్లర్ సినిమాలను చూడడం అనేది ఒక అలవాటుగా మారింది ఇప్పుడు. కొంత మందికి అయితే రోజుకో థ్రిల్లర్ మూవీ చూడనిదే నిద్ర కూడా పట్టదు. ఇక ఈ జానర్ లో వచ్చే కొన్ని సినిమాలు ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయంటే చూసి నెలలు గడుస్తున్నా ఆ స్టోరీని మరిచిపోలేరు. ఈ రోజు కూడా అలాంటి మూవీనే మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఈ డిఫరెంట్ జానర్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

మసాలా ఘాటు ఎక్కువే…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీలో మసాలా సీన్స్ గట్టిగానే ఉంటాయి. టైటిల్ కు తగ్గట్టుగానే ఇదొక బో*ల్డ్ కంటెంట్ మూవీ అని మరచిపోవద్దు. కాబట్టి ఈ సినిమాను సింగిల్ గా చూస్తే బెటర్. ప్రస్తుతం ఈ మూవీ ది ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. సినిమా మొత్తం ఒక అమ్మాయి లైఫ్ చుట్టూ తిరుగుతుంది. డబ్బు సంపాదించడానికి ఆమె ఎలాంటి పనులు చేసిందో చూస్తే షాక్ అవుతారు. అలాగే ఆమె విషాద గాథ మనసును పిండేస్తుంది. పగవాడికి కూడా అలాంటి కష్టం రావొద్దు అని అన్పిస్తుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం పదండి.

Film Review | "Sleeping Beauty" (2011) - YouTube

- Advertisement -

కథ ఏంటంటే…

ఈ సినిమాలో హీరోయిన్ ది చాలా పేద కుటుంబం. అలాగే ఆమెకు ఒక చెల్లి కూడా ఉంటుంది. హీరోయిన్ డబ్బు కోసం రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ రోజంతా క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది. ఆమె బెస్ట్ బాయ్ ఫ్రెండ్ కు ఎప్పుడూ తాగడం ఊగడమే పని. కానీ అతనితో ఉంటే హీరోయిన్ కష్టాలను మర్చిపోతుంది. ఆ కొద్దిసేపు మాత్రం సంతోషంగా ఉంటుంది. అయితే అతనేమో ఎప్పుడూ పెళ్లి చేసుకుందాం అని అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అతని ఆ ప్రస్తావన తెక్కినప్పుడల్లా నో చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కు కొత్త జాబ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదే సమయంలో ఓ ఇన్నర్ వేర్ యాడ్ కు సెలెక్ట్ అవుతుంది. కొద్దిరోజుల్లోనే పాపులర్ కావడంతో పాటు ఆమెకు ఓ కొత్త ఆఫర్ వస్తుంది. ముక్కూ మొహం తెలియని వాళ్ళ పక్కన పడుకుంటే డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళు ఆమెను పట్టుకుని పడుకోవడం తప్పితే ఇబ్బంది మాత్రం పెట్టరు. హీరోయిన్ ఆ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాగా డబ్బు సంపాదిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కు షిఫ్ట్ అవుతుంది. కానీ అసలు అక్కడేం జరుగుతోంది? అలా పడుకుంటే ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ముందు ముందు హీరోయిన్ ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది? మరి హీరో చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలకు సమాధానం తెలియాలంటే లూసీ లైఫ్ అనే ఈ మూవీపై ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు