Anchor Ravi: బిగ్ బాస్ బాగోతాలు గుట్టురట్టు.. ఇంత దారుణమా..?

Anchor Ravi.. బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఎంతో మందికి పాపులారిటీ సంపాదించి పెట్టింది. కానీ కెరియర్ని మాత్రం అందించలేదని చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత చాలామంది కెరియర్ అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా బిగ్బాస్ షోలో నాలుగు గోడల మధ్య జరిగేది వేరు.. చూపించేది వేరు అంటూ చెబుతున్నాడు ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇప్పుడు ప్రముఖ యాంకర్ రవి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి .. ఈ సందర్భంగా అక్కడ జరిగే దారుణాలను కాస్త బయటపెట్టాడు.

Anchor Ravi: Bigg Boss's success is so bad..?
Anchor Ravi: Bigg Boss’s success is so bad..?

హౌస్ లోకి వెళ్లాలన్న సరదా తీరిపోతుంది..

వాస్తవానికి బిగ్బాస్ అనేది రియాల్టీ షో మాత్రమే కాదు. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ తెచ్చిపెడుతుంది కూడా.. అందుకే సామాన్యులకు కూడా ఇందులో అడుగు పెట్టాలని , పాపులారిటీ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే అలా వచ్చిన వారికి సరదా కాస్త తీరిపోతుందని చెబుతున్నారు యాంకర్ రవి. బిగ్బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్గా చేసిన తర్వాత తన ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పుకొచ్చాడు. నటి లహరి బ్యాచిలర్స్ గా ఉండగా , పెళ్లైన నా వెనకాల పడుతుందని నటి ప్రియాతో రవి అన్న విషయం ఒక్కసారిగా హైలైట్ అయింది. ఈ వీడియోలు ప్రదర్శించడంతో యాంకర్ రవి కెరియర్ కు చాలా మైనస్ అయిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బిగ్ బాస్ బాగోతాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.

హౌస్ లో ఉన్నంతసేపు కొట్టుకు చావాలి..

రవి బిగ్ బాస్ షోలో జరిగే బాగోతల గురించి మాట్లాడుతూ.. బిగ్బాస్ షో ప్రధాన పాలసీ ఒకడిని మరొకడు క్రిందకులాడం, ఇంకొకడు ఒకడు పర్ఫామెన్స్ తో ఎదగాలని చూస్తే మరొకడు ఎదిగే వాడిని కిందికి ఇ
లాగి పైకి వెళ్లాలని చూస్తాడు. మొత్తం 20 మందిలో కూడా జరిగేది ఇదే. శనివారం ఎవరిది బ్యాడ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆదివారం నాగార్జున వచ్చి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేస్తారు . ఇక సోమవారం నామినేషన్స్ ఇలా మూడు రోజుల పాటు కంటెస్టెంట్స్ కొట్టుకు చస్తారు. అయితే మిగతా రోజులు కూడా ఎవరిని నామినేట్ చేయాలి ? ఏ కారణాలు చెప్పాలి? అని ఆలోచిస్తూ నరకం చూస్తారు ..ముఖ్యంగా అందరికీ కలిపి ఒక పచ్చడి బాటిల్ ఇస్తారు ..దాని వద్ద కూడా కొట్లాటలు ఆకలికి చచ్చిపోవాలంతే. నేను హౌస్ లో 85 రోజులు ఉంటే దాదాపు పది కేజీలు బరువు తగ్గాను. శ్రీరామ్ అయితే ఏకంగా 12 , షణ్ముఖ్ 15 కేజీలు బరువు తగ్గాడు ముఖ్యంగా ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు హౌస్ లోకి రావచ్చని కూడా చెప్పుకొచ్చారు.

- Advertisement -

కుటుంబ సభ్యుల కోసం రిక్వెస్ట్ చేసినా చూపించరు..

కేవలం గంట ఫుటేజ్ వాళ్లకి ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసుకుంటారు. మిగతాది అలాగే టెలికాస్ట్ చేసేస్తారు. కుటుంబ సభ్యుల గురించి ఎంత అడిగినా సరే వాళ్ళు చెప్పరు.. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మనకు ఎటువంటి సంబంధాలు కూడా ఉండవు. చాలామంది కెమెరాల వద్దకు వెళ్లి తమ వారిని కలవాలని, మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే నేను చేసిందే అక్కడ చూపించి హైలెట్ చేశారు.ముఖ్యంగా నేను శ్రీరామచంద్ర , సన్నీ తో చాలా క్లోజ్ గా ఉండేవాణ్ణి. అది మాత్రం చూపించలేదు. అక్కడ జరిగేది ఒకటి, వారు చూపించేది ఇంకొకటి అంటూ పలు షాకింగ్ కామెంట్లు చేశారు యాంకర్ రవి. ఏది ఏమైనా రవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు