Charmy Kaur : ఎట్టకేలకు ఈవెంట్ లో మాట్లాడింది.. కానీ హ్యాపీగా లేదా?

Charmy Kaur : రామ్ పోతినేని – పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ మొత్తం రావడం జరిగింది. ఇక రామ్ – పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గానే డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఐదేళ్ల తర్వాత సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” తెరకెక్కగా, వరుస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్, రామ్ లకు ఈ సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఈ సినిమాని భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ లో రామ్, పూరి తో పాటు ఈ సారి ఛార్మి కూడా ఈవెంట్ లో సందడి చేసింది.

Charmi Kaur's speech at the Double Smart pre-release event

ఛార్మి ఇంకా హ్యాపీగా లేదా?

ఇక డబుల్ ఇస్మార్ట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు ఇంతవరకు బయటికి రాని ఛార్మి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ప్రమోట్ చేసింది. డబుల్ ఇస్మార్ట్ కి పూరితో పాటు ఛార్మి కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ అని అందరికి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మి మాట్లాడుతూ… “హాయ్ వరంగల్.. ఇస్మార్ట్ శంకర్ కి ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాం. సీక్వెల్ తీస్తే ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తామని అప్పుడే చెప్పాం. ఇస్మార్ట్ ని చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ఆగస్ట్ 15న మీ ముందుకు రాబోతోంది. ఆ రోజు సినిమా హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. లవ్ యూ ఆల్” అంటూ ముగించింది.

- Advertisement -

హిట్టయితేనే మాట్లాడుతుందా లేక.. ఇంకేమైనా?

అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛార్మి ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా పూర్తిగా మాట్లాడలేకపోయింది. ఇటు ఛార్మి ఫేస్ లో కూడా అంతగా ఎక్సయిట్మెంట్ కనిపించట్లేదు. పైగా హిట్ అయ్యాకే మాట్లాడుతానని చెప్పుకొచ్చింది. అంటే ఛార్మికి సినిమా మీద నమ్మకం లేదా? లేదా మాట్లాడడం ఇష్టం లేదా అని డౌట్ వస్తుంది. పైగా గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు చేసిన ఆందోళనలు చూసే ఉంటాం. దానివల్ల ఏమైనా ఛార్మి ఇబ్బంది పడిందా అన్న డౌట్ కూడా వస్తుంది. ఏది ఏమైనా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా వచ్చింది సంతోషం అన్నట్టు చిత్ర యూనిట్ మనస్సులో ఉండుంటుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్, పూరి జగన్నాథ్ తో పాటు కావ్య థాపర్, అలీ, టెంపర్ వంశీ, గెటప్ శీను తదితర నటీనటులు మాట్లాడడం జరిగింది. ఇక ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు