Thalapathy Vijay : సూర్య, కార్తీలను చూసి దళపతి ఇప్పుడైనా నేర్చుకోవాలంటున్న నెటిజన్లు..

Thalapathy Vijay : టాలీవుడ్ లో తమిళ హీరోలకు, వాళ్ళ సినిమాలకు కూడా ఎప్పట్నించో మంచి ఆదరణ న్నా ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కమల్ హాసన్, రజినీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోల నుండి ఇప్పటి విజయ్, అజిత్, సూర్య, కార్తీ, ధనుష్, విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఏ సినిమా అయినా ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే. పైగా రజినీకాంత్, సూర్య లాంటి స్టార్ హీరోలకు ఇక్కడ కూడా అభిమాన సంఘాలున్నాయి. వాళ్ళ సినిమా రిలీజ్ అయినపుడు ఒక్కోసారి తమిళనాడు తో సమానంగా తెలుగురాష్ట్రాల్లో ఓపెనింగ్స్ వస్తుంటాయి. పైగా ఎంతో మంది తమిళ స్టార్ హీరోలు తెలుగు ఆడియన్స్ కి ఎంతో గౌరవం ఇస్తారు. తమ సినిమాలని తెలుగులో ప్రమోట్ చేస్తూ ఇక్కడ ప్రీ రీలిజ్ ఈవెంట్స్ చేస్తుంటారు. ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటారు.

Telugu audience trolling on Thalapathy Vijay

తెలుగు ప్రేక్షకుల ప్రేమ మరువలేనిది..

ఇక తమిళ స్టార్ హీరోలైన సూర్య, కార్తీ, విక్రమ్ లాంటి హీరోలు కూడా ఎన్నో సార్లు తెలుగు ప్రేక్షకుల గురించి గొప్పగా చెప్తారు. ఇక కార్తీ అయితే తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులకే ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇలా తమిళం నుంచి పలువురు హీరోలు అటు తమ మార్కెట్ ఇటు ఆదరణ కూడా నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమిళ స్టార్ దళపతి విజయ్ దీనికి పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి. విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఎప్పట్నించొ తన సినిమాలని టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నా, ఓ పదేళ్ల నుండే తన సినిమాలకి డిమాండ్ వచ్చిందని చెప్పాలి. తుపాకీ, అదిరింది, బిగిల్, రీసెంట్ గా లియో వంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ వచ్చింది.

- Advertisement -

సూర్య, కార్తిలను చూసైనా విజయ్ నేర్చుకోవాలి…

ఇక విజయ్ తుపాకీ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. పలు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అయినా కూడా ఒక్క సినిమాకి కూడా తెలుగులో ప్రీ రిలీజ్ కి కానీ, ప్రమోషన్స్ కి కానీ విజయ్ వచ్చింది లేదు. దీనిపై తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పట్నుంచో వ్యతిరేకంగా ఉన్నారు. తెలుగు మార్కెట్ వసూళ్లు కావాలి కానీ, తెలుగు ప్రేక్షకుల పట్ల గౌరవం ఉండదా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అప్పుడెప్పుడో పదేళ్ల కింద శంకర్ స్నేహితుడు ఈవెంట్ లో సందడి చేసిన విజయ్ ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ ని పలకరించలేదు. ఇది ఒకరకంగా తెలుగు ప్రేక్షకులని చిన్న చూపు చూసినట్టే అని చెప్పాలి. ఇక త్వరలో తన ‘గోట్’ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడైనా విజయ్ మేల్కొని తెలుగు ప్రేక్షకులకి తన కృతజ్ఞతలు తెలియచేస్తాడా? లేదా ముందు ముందు మార్కెట్ ని కోల్పోతాడా అనేది విజయ్ చేతుల్లోనే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు