Lakshmi Pranati: ఎన్టీఆర్ భార్యపై అలాంటి కామెంట్స్ చేసిన బామ్మర్ది..!

Lakshmi Pranati.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్, అతి తక్కువ సమయంలోనే గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఈయన బామ్మర్ది నార్నే నితిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడే నార్నే నితిన్. తాజాగా ఈయన తన సోదరి లక్ష్మీ ప్రణతి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Lakshmi Pranati: brother who made such comments on NTR's wife..!
Lakshmi Pranati: brother who made such comments on NTR’s wife..!

లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియా కి దూరం..

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో లక్ష్మీ ప్రణతి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె మీడియా ముందుకు అస్సలు రారు. సినిమా ఈవెంట్స్ కి హాజరు కారు. ఒక్కసారి కూడా ఆమె మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. అసలు లక్ష్మీ ప్రణతి నేచర్ ఎలాంటిది? ఆమె ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలు కూడా ఎవరికీ తెలియవు. అందుకే ఈమె మిగతా హీరోల భార్యల కంటే చాలా భిన్నం అనే చెప్పాలి. ఇప్పటికే మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ , రాంచరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఇలా వీళ్లంతా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరి లైఫ్ స్టైల్, వీరు వృత్తి, వీరి వ్యాపకాలు అన్నీ కూడా మనకు తెలుసు.

వీరందరికీ భిన్నం తారక్ భార్య..

రామ్ చరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ ఉమెన్, దీనికి తోడు ఆమె న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కూడా. పైగా సోషల్ యాక్టివిస్ట్ అని కూడా చెప్పవచ్చు. నమ్రత విషయానికి వస్తే ఒకవైపు తన భర్త మహేష్ బాబుకి సలహాదారు మాత్రమే కాదు బిజినెస్ ఉమెన్ గా కూడా దూసుకుపోతోంది ఇక స్నేహ రెడ్డి విషయానికొస్తే, ఈమె ఫిట్నెస్ ఫ్రీక్.. అందంగా కనిపించడం కోసం రోజు వ్యాయామం, యోగ వంటివి చేస్తూ ఉంటుంది. అయితే వీరందరికీ భిన్నంగా లక్ష్మీ ప్రణతి వ్యవహరిస్తోందని చెప్పవచ్చు. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండే ఈమె గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆత్రుతగా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమెను ఉద్దేశిస్తూ ఈమె తమ్ముడు నార్నే నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు.

- Advertisement -

అక్క చాలా రిజర్వ్డ్ అంటున్న నార్నే నితిన్..

నార్నే నితిన్ తాజాగా నటించిన చిత్రం ఆయ్. ఈనెల 15వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ తన సోదరి గురించి చెప్పారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి ఎలాంటివారో చెప్పాలని యాంకర్ అడిగింది. దానికి ఆమె తమ్ముడు సమాధానం చెబుతూ.. మా అక్కతో నాకు క్రేజీ బాండింగ్ ఉంది. అక్క చాలా రిజర్వ్డ్ .. ఎవరితో కూడా పెద్దగా కలవరు. పెద్దగా మాట్లాడరు. మా మధ్య అయితే మాత్రం చాలా మంచి బాండింగ్ ఉంది అంటూ తెలిపారు నితిన్.

ఫ్యాన్స్ కోరిక లక్ష్మీ ప్రణతి తీరుస్తారా..

ఇకపోతే 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్ .ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి అభిరామ్, చిన్నబ్బాయి భార్గవ్ రామ్. గతంలో సాంప్రదాయంగా కనిపించిన లక్ష్మీ ప్రణతి ఈ మధ్య ట్రెండుకు తగ్గట్టుగా మారిపోయిందని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల అమెరికా ట్రిప్పులో కూడా ఈమె మోడ్రన్ డ్రెస్ లో కనిపించి అందరిని ఆకర్షించింది. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ 31వ సినిమా లాంచింగ్ లో కూడా కనిపించింది. ఎప్పటికైనా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇస్తే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. మరి వారి కోరిక తీరుస్తుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు