Nag Ashiwin : బంపర్ ఆఫర్… నాగ్ అశ్విన్ కొత్త సినిమాలో ఛాన్స్ కావాలా..?

 

Nag Ashiwin: ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన “కల్కి 2898 ఏడి” బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దండయాత్ర చేసింది. ఈ సినిమా రూ. 1200 కోట్ల క్లబ్ దాటింది. దీంతో ప్రభాస్ ఖాతాలో బాహుబలి-2 తర్వాత రూ. 1000 కోట్లు సాధించిన రెండో సినిమాగా కల్కి 2898 ఏడి నిలిచింది. మరోసారి డార్లింగ్ బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించుకున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మహాభారతానికి, సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ వెండితెరపై విజువల్ వండర్ క్రియేట్ చేశాడు.

6000 సంవత్సరం క్రితంకు వెళ్ళి నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. మొత్తానికి కల్కి 2898 ఏడితో ప్రభాస్ ఒక అద్భుతాన్ని సృష్టించాడని…. ఆయన విజనరీకి హ్యాట్సాఫ్ అంటూ అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక కల్కి సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కల్కి-2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కల్కి-2 సినిమా వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలవుతుందని…. 2025 లోనే సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ AVM స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్లు…. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ AVM స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు