Stree 2: .ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన యంగ్ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్..!

Stree 2.. తాజాగా ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రికార్డులను ఎవరు బ్రేక్ చేయలేదని అందరూ అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ , మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆయన రికార్డులను అందుకోలేక పోయారు. అలాంటిది ఇప్పుడు ఒక యంగ్ బ్యూటీ అందులోనూ అమ్మాయై ఉండి , తన సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లెక్కలను బ్రేక్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి. మరి ఎవరా బ్యూటీ? ఏంటా సినిమా? ఏంటా రికార్డు బ్రేక్ ?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Stree 2: .Prabhas record breaking young beauty.. Fans in shock..!
Stree 2: .Prabhas record breaking young beauty.. Fans in shock..!

ప్రభాస్ కల్కి మూవీ రికార్డ్ బ్రేక్ చేసిన శ్రద్ధా స్త్రీ 2..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ కీలకపాత్రలో వచ్చిన చిత్రం స్త్రీ. హారర్ , కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే మొదటి భాగంలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ సినిమా ఇప్పుడు స్త్రీ 2 పేరుతో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్ సినిమాపై ఊహించని అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధ కపూర్ సినిమా ప్రభాస్ కల్కి రికార్డులను బ్రేక్ చేసేసినట్లు సమాచారం.

అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డు బ్రేక్..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్న స్త్రీ 2 ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోని బాలీవుడ్లో తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఫైటర్, కల్కి 2898AD సినిమాల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను సైతం దాటేసి ఇప్పటివరకు రూ .20 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది . ఈ హవా ఇలాగే కొనసాగితే తొలి రోజు కలెక్షన్లు కూడా ఈ రెండు సినిమాలను దాటేయడం గ్యారెంటీ అంటూ బాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక యంగ్ బ్యూటీ హార్రర్, కామెడీ జానర్ లో సినిమాను తెరకెక్కిస్తూ.. ఇప్పుడు రూ .700 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కల్కి సినిమా రికార్డులనే బ్రేక్ చేయడం అంటే ఆషామాషీ కాదు. ఏది ఏమైనా ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

శ్రద్ధా కపూర్ కెరియర్..

బాలీవుడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ.. అక్కడే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా కపూర్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు ఊహించని స్థాయిలో పాపులారిటీ కూడా సొంతం చేసుకుంది. ఇక ఈమె ఎవరో కాదు ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె. 2010లో హీస్ట్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు స్త్రీ 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతోంది శ్రద్ధా కపూర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు